News July 17, 2024
కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య విజ్ఞప్తి

విజయవాడ డివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్న కారణంగా విజయవాడ నుంచి హుబ్లీ వెళ్లే రైళ్లను రద్దు చేశామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆగస్టు 1 నుంచి 10 వరకు నం.17329 హుబ్లీ- విజయవాడ, నం.17330 విజయవాడ-హుబ్లీ డైలీ ఎక్స్‌ప్రెస్‌లను ఆగస్టు 2 నుంచి 11 వరకు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులు రైళ్ల రద్దు అంశాన్ని గమనించాలని సూచించారు.
Similar News
News December 23, 2025
కృష్ణా: ప్రమాదంలో యువకుడి మృతి.. మరొకరికి గాయాలు

చల్లపల్లి మండలం మాజేరు గ్రామ సమీపంలో 216 జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల విరాల మేరకు.. బైక్‌ను కారు ఢీ కొట్టింది. సిరివెల్ల భాగ్యం రాజు (24) మృతి చెందగా, చెన్ను రాఘవ (25) తీవ్ర గాయాలతో గాయపడ్డాడు. క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News December 23, 2025
హైదరాబాద్‌లో కృష్ణా జిల్లా వ్యక్తి గంజాయి దందా

HYD గచ్చిబౌలిలోని ఓ పీజీ హాస్టల్ వేదికగా సాగుతున్న మాదకద్రవ్యాల గుట్టును రాయదుర్గం పోలీసులు, రాజేంద్రనగర్ ఎస్వోటీ బృందం రట్టు చేసింది. కృష్ణా (D) పెదపారుపూడికి చెందిన కంభు వంశీ, చీరాల వాసి బాలప్రకాశ్ బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి ముందుగా విజయవాడకు, అక్కడి నుంచి HYDకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలోని ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు తెలిపారు.
News December 23, 2025
కృష్ణా: UPHS, PHCలలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్టు DMHO యుగంధర్ తెలిపారు. UPHSలలో ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పోస్ట్ ఒకటి, ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులు 7, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 4, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టులు10, PHCలలో ల్యాబ్ టెక్నిషియన్ 12, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ 16, శానిటరీ అటెండర్ కం వాచ్‌మెన్ పోస్టులు 10 ఖాళీలకు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.


