News September 20, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

విజయవాడ, గుడివాడ మీదుగా తిరుపతి(TPTY)- బిలాస్‌పూర్ (BSP) మధ్య ప్రయాణించే 2 ఎక్స్‌ప్రెస్‌లకు కొవ్వూరులో దక్షిణ మధ్య రైల్వే ప్రయోగాత్మకంగా స్టాప్ ప్రవేశపెట్టింది. ప్రయాణికుల సౌలభ్యం మేరకు కొవ్వూరులో ఇచ్చిన స్టాప్‌ను ఈ నెల 21 నుంచి పొడిగిస్తున్నామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. నం.17481 BSP-TPTY రైలు ఈ నెల 21 నుంచి, నం.17482 TPTY-BSP రైలు ఈ నెల 22 నుంచి కొవ్వూరులో ఆగుతుందన్నారు.

Similar News

News September 20, 2024

కృష్ణా: విద్యార్థులకు అలర్ట్..పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో చదివే డిగ్రీ విద్యార్థులకు నిర్వహించే 3,5వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు ఈ నెల 27 నుంచి అక్టోబర్ 14లోపు అపరాధ రుసుము లేకుండా నిర్ణీత ఫీజు చెల్లించాలని, ఈ పరీక్షలు నవంబర్ 11 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ తెలిపింది. ఫీజు, షెడ్యూల్ వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని కోరింది.

News September 20, 2024

కృష్ణా: ఈ నెల 26తో ముగియనున్న రిజిస్ట్రేషన్ గడువు

image

2024-25, 2025-26 విద్యా సంవత్సరాలకు సంబంధించి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ITI కళాశాలల్లో అడ్మిషన్ పొందేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని గుడివాడ ITI కాలేజీ ప్రిన్సిపల్ ఎల్. గౌరీమణి తెలిపారు. https://www.iti.ap.gov.in/ వెబ్‌సైట్‌లో అడ్మిషన్లకు ఈ నెల 26లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఈ నెల 28న ప్రభుత్వ, 30న ప్రైవేట్ ITI కళాశాలల్లో అడ్మిషన్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు.

News September 20, 2024

4,500 క్లెయిములను పరిష్కరించాం: కలెక్టర్ సృజన

image

వరదల కారణంగా దెబ్బతిన్న చిన్న, మధ్యతరహా వ్యాపార సముదాయాల ఆస్తులకు సంబంధించిన 4,500 క్లెయిములను పరిష్కరించామని కలెక్టర్ సృజన అన్నారు. ఈ అంశంపై ఆమె గురువారం మాట్లాడుతూ..4,500 క్లెయిముల ద్వారా రూ.27.93 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన క్లెయిములు పరిష్కారం అయ్యాయన్నారు. ప్లంబర్, AC మెకానిక్ సేవలను పొందేందుకు 44,15 సర్వీస్ రిక్వెస్టులు నమోదు కాగా 95.7% రిక్వెస్టులకు సేవలను అందజేశామన్నారు.