News September 13, 2025

కృష్ణా: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

ప్రయాణికుల రద్దీ మేరకు ఉమ్మడి జిల్లా మీదుగా సంబల్‌పూర్ (SBP), ఈరోడ్(ED) మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ స్పెషల్ ట్రైన్స్ SEPT 17 నుంచి NOV 26 వరకు ప్రతి బుధవారం SBP-ED(నం.08311), SEPT 19 నుంచి NOV 28 వరకు ప్రతి శుక్రవారం ED-SPB(నం.08312) మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. కాగా ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో కైకలూరు, గుడివాడ, విజయవాడలో ఆగుతాయన్నారు.

Similar News

News September 13, 2025

ఆసియాకప్: ఫైనల్లో భారత మహిళా జట్టు

image

హాకీ ఆసియా కప్‌లో భారత మహిళా జట్టు ఫైనల్ చేరింది. జపాన్‌‌తో జరిగిన సూపర్ స్టేజి-4 మ్యాచ్‌లో 1-1 గోల్స్‌తో మ్యాచ్ డ్రాగా ముగియగా, అటు కొరియాపై చైనా 1-0తో విజయం సాధించింది. దీంతో పాయింట్ల ఆధారంగా ఉమెన్ ఇన్ బ్లూ జట్టు ఫైనల్ చేరింది. రేపు చైనాతో అమీతుమీ తేల్చుకోనుంది. గెలిచిన జట్టు వచ్చే ఏడాది జరిగే WCనకు అర్హత సాధించనుంది. ఇటీవల జరిగిన పురుషుల హాకీ ఆసియాకప్‌లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

News September 13, 2025

బాపట్ల జిల్లా నూతన SP ఇతనే.!

image

బాపట్ల జిల్లా నూతన ఎస్పీగా ఉమామహేశ్వర్ నియమితులయ్యారు. ప్రస్తుతం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న తుషార్ డూడీని బదిలీ చేసి ఆయన స్థానంలో ఉమామహేశ్వర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఎస్పీ తుషార్ చిత్తూరు జిల్లాకు బదిలీ అయ్యారు. ఇప్పటికే జిల్లాకు నూతన కలెక్టర్ రాగా నేడు ప్రకటించిన ఎస్పీల బదిలీల్లో భాగంగా నూతన ఎస్పీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

News September 13, 2025

NRPT: లోక్ అదాలత్‌లో 5,581 కేసుల పరిష్కారం

image

నారాయణపేట, కోస్గి కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 5,581 కేసులు పరిష్కారం అయినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా జరిమానాల రూపంలో ప్రభుత్వానికి రూ.22,17,956 ఆదాయం సమకూరిందని చెప్పారు. లోక్ అదాలత్ విజయవంతం కావడానికి కృషి చేసిన పోలీస్, ఎక్సైజ్, కోర్టు సిబ్బంది, న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు.