News May 25, 2024
కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య విజ్ఞప్తి
విజయవాడ- కాజీపేట సెక్షన్‌లో మూడో లైన్ పనులు జరుగుతున్నందున ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే కింది రైళ్లు ఈ నెల 29 వరకు మధిర(TG) స్టేషన్‌లో ఆగవని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు రైల్వే వర్గాలు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశాయి.
.నం.12861 విశాఖపట్నం- మహబూబ్‌నగర్
.నం.17201 గుంటూరు- సికింద్రాబాద్
.నం.12713 విజయవాడ- సికింద్రాబాద్
.నం.12705 గుంటూరు- సికింద్రాబాద్
Similar News
News November 29, 2024
కృష్ణా: రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో సెప్టెంబర్ 2024లో నిర్వహించిన బీ-ఫార్మసీ 2వ సెమిస్టర్ పరీక్షల(2023- 24 విద్యా సంవత్సరం) రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు డిసెంబర్ 4లోపు ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఫీజు చెల్లింపు వివరాలకై https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.
News November 29, 2024
తొలిరోజే 100శాతం పెన్షన్ల పంపిణీ: కలెక్టర్ లక్ష్మీశ
డిసెంబర్ 1 ఆదివారం నేపథ్యంలో ముందు రోజే నవంబర్ 30న ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. తొలిరోజే 100 శాతం పెన్షన్ల పంపిణీకి అధికారులు, సిబ్బంది కృషిచేయాలని ఆదేశించారు.శుక్రవారం కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పంపిణీ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసేలా అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
News November 29, 2024
మచ్చిలీపట్నం: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
బందరు మండలం సుల్తానగరంలో సీతారామాంజనేయ రైస్ మిల్లును కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటి వరకు ఎంత మేర ధాన్యం కొనుగోలు చేశారో మిల్లు యజమానిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్ఎన్ గొల్లపాలెం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించారు.