News June 25, 2024

కృష్ణా: రైల్వే ప్రయాణికులకు శుభవార్త

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా కాకినాడ టౌన్(CCT)- లింగంపల్లి(LPI) మధ్య నడిచే స్పెషల్ రైళ్లను పొడిగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.07445 CCT- LPI రైలును జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు వారంలో 3 రోజులు, నం.07446 LPI- CCT రైలును జూలై 2 నుంచి అక్టోబర్ 1 వరకు వారంలో 3 రోజులు నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో విజయవాడతో పాటు గుడివాడ, కైకలూరు స్టేషన్లలో ఆగుతాయన్నారు.

Similar News

News September 29, 2024

సీఎం చంద్రబాబుతో సిద్దార్థనాథ్ సింగ్ భేటీ

image

మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత సిద్దార్థనాథ్ సింగ్ శనివారం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో కలిశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం గత 100 రోజులుగా రాష్ట్రంలో NDA కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి సీఎంతో చర్చించానని సిద్దార్థనాథ్ సింగ్ ట్విట్టర్(X)లో పోస్ట్ చేశారు.

News September 29, 2024

కృష్ణా: లా కోర్సు విద్యార్థులకు ముఖ్య గమనిక

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో LLM కోర్సు విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్(రెగ్యులర్) థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. అక్టోబర్ 15,16,17 తేదీల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టు వారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.

News September 28, 2024

విజయవాడ: మధ్యాహ్న భోజన పథకం అమలుపై వర్క్‌షాప్

image

కలెక్టర్ జి.సృజన శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలుపై సంబంధిత అధికారులతో విజయవాడ కలెక్టరేట్‌లో వర్క్‌షాప్ నిర్వహించారు. వర్క్‌షాప్‌లో DSEO యూవీ సుబ్బారావు, న్యూట్రిషనిస్ట్ డా.సుష్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మధ్యాహ్న భోజన పథకం మెనూ అమలు, తదితర అంశాలపై కలెక్టర్ జి. సృజన క్షేత్రస్థాయి అధికారులకు పలు కీలక సూచనలిచ్చారు.