News December 25, 2025
కృష్ణా: రోడ్డు ప్రమాదం.. మహిళ దుర్మరణం

ఏ కొండూరు మండలం గోపాలపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం చెందారు. గ్రామానికి చెందిన భూక్య కమల (40) రహదారి పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనా స్థలంలోనే కన్నుమూశారు. కమల మృతితో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
Similar News
News January 2, 2026
జల జగడంపై కమిటీ.. కేంద్రం నిర్ణయం

తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాల పరిష్కారానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర జలసంఘం ఛైర్మన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాల నుంచి నలుగురు చొప్పున కమిటీలో సభ్యులు ఉండనున్నారు. అలాగే కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లు, NWDA, CWC సీఈలు కూడా సభ్యులుగా వ్యవహరిస్తారు.
News January 2, 2026
వ్యాపారస్తులకు ఉద్యమ్ సర్టిఫికెట్ తప్పనిసరి- PO

గిరిజన ప్రాంతంలో వ్యాపారస్తులు, చిన్న పరిశ్రమల నిర్వాహకులు తప్పనిసరిగా ఉద్యమ పోర్టల్లో రిజిస్టర్ కావాలని ఐటిడిఏ పీఓ స్మరన్ రాజ్ అన్నారు. శుక్రవారం రంపచోడవరం ఐటీడీఏలో అన్ని మండలాల వెలుగు ఏపీఎంలతో పీఓ సమావేశం నిర్వహించారు. ప్రతి వ్యాపారస్తులు ఉద్యమ్ పోర్టల్‌లో నమోదు కావాలని అధికారులకు పీవో సూచించారు. ఉద్యమ్ సర్టిఫికెట్ వల్ల వ్యాపారస్తులకు ఎంతగానో ఉపయోగంటుందని పీఓ అన్నారు.
News January 2, 2026
BRS నిర్ణయంతో సభకు కేసీఆర్ రానట్లే

TG: BRS చీఫ్ KCR శాసనసభకు హాజరుకారని తేలిపోయింది. పాలమూరు ప్రాజెక్టు, కృష్ణా జలాలపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన KCR తొలిరోజు సభలో 3 ని.లు మాత్రమే ఉన్నారు. ఇవాళ రెండో రోజు సమావేశానికీ హాజరు కాలేదు. మరోవైపు ప్రస్తుత సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు BRS కూడా ప్రకటించడంతో ఇక రారనేది స్పష్టమైంది. కాగా కేసీఆర్ సభకు వస్తారని భావించి కాంగ్రెస్ సిద్ధమైంది. ఆయన సభకు రాకపోవడాన్ని CM రేవంత్ తప్పుబట్టారు.


