News September 26, 2024

కృష్ణా: రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన

image

కృష్ణా జిల్లా పోలీసులు రోడ్డు ప్రమాదాలను నివారించడానికి వాహనదారులు పాటించాల్సిన నియమాలపై గురువారం అవగాహన కల్పించారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో తనిఖీలు చేస్తున్న సమయంలో హెల్మెట్ ధరించకుండా, నిబంధనలు పాటించకుండా వాహనం నడుపుతున్నవారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ నియమాలు, నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని వారు వాహనదారులను హెచ్చరించారు.

Similar News

News November 24, 2024

విజయవాడ: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం, పెళ్లి.. కేసు నమోదు 

image

మైనర్ బాలికను మోసం చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుణదల పోలీసుల వివరాల మేరకు.. ఏలూరుకి చెందిన పద్మావతి అనే బాలికకు గుణదలకు చెందిన రాంపండు అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. పద్మావతి 4నెలల క్రితం ఎవరికీ చెప్పకుండా రాంపండును పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం రాంపండు కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో వారిపై కేసు నమోదు చేశామని గుణదల పోలీసులు శనివారం తెలిపారు. 

News November 24, 2024

2022లో చంద్రబాబు బస్సుపై రాళ్ల దాడి.. కేసు UPDATE

image

2022లో చంద్రబాబు బస్సు యాత్రపై రాళ్ల దాడి ఘటనలో సంబంధమున్న నలుగురిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. సజ్జనరావు, కిశోర్, కార్తీక్‌లను శనివారం ఉదయం అదుపులోకి తీసుకోగా శ్రీనివాస్ అనే వ్యక్తిపై తాజాగా కేసు నమోదైంది. నందిగామ పోలీసులు వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 2022 నవంబర్ 5న చంద్రబాబు బస్సు యాత్ర చేస్తుండగా నందిగామలో ఈ ఘటన జరగగా, తాజాగా ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.

News November 24, 2024

కృష్ణా: రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు అందజేసిన అధికారులు

image

అమరావతి నిర్మాణానికి భూములిచ్చి గతంలో రిటర్నబుల్ ప్లాట్లు అందుకోని వారికై CRDA అధికారులు శనివారం విజయవాడలోని తమ కార్యాలయంలో ఈ-లాటరీ విధానంలో ప్లాట్లు అందజేశారు. మొత్తం 37 మంది రైతులకు 120 నివాస, 49 వాణిజ్య ప్లాట్ల ప్రొవిజినల్ సర్టిఫికెట్లను ఇచ్చామని CRDA అదనపు కమిషనర్ ఎం. నవీన్ చెప్పారు. రైతులు సంబంధిత రిజిస్ట్రేషన్ కేంద్రాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు.