News August 21, 2024

కృష్ణా: వరదలో కొట్టుకుపోయిన రైతు

image

ఎన్టీఆర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తిరువూరు మండలం ముష్టకుంట్ల పడమటి వాగులో రైతు వరద నీటిలో గల్లంతైయ్యాడు. మంగళవారం రైతు అరిసేపల్లి వేణు(45) పశువులను మేపేందుకు వెళ్లాడు. ఇంటికొస్తుండగా పడమటి వాగు వరద నీటిలో కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది పడమటి వాగు పరివాహక ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News July 4, 2025

ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకోవాలి: కలెక్టర్

image

జీవితంలో ఒక ఉన్నత లక్ష్యం ఎంచుకొని దానికి అనుగుణంగా కష్టపడి సాధన చేసి అక్కడికి చేరుకోవాలని కలెక్టర్ బాలాజీ పిల్లలకు ఉద్బోధించారు. కలెక్టరేట్‌లో PM కేర్ పథకం కింద కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి గుర్తించిన పిల్లలతో కలెక్టర్ శుక్రవారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వారి బాగోగులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

News July 4, 2025

నిధులు ఉన్నా పనులు ఎందుకు చేయడం లేదు: కలెక్టర్

image

కృష్ణా జిల్లాలో CSR నిధులు ఉన్నప్పటికీ మైక్రో వాటర్ ఫిల్టర్‌ల నిర్మాణంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని RWS అధికారులను కలెక్టర్ బాలాజీ ప్రశ్నించారు. కలెక్టరేట్‌లో గ్రామీణ నీటి సరఫరా ఫిల్టర్‌లు, అంగన్వాడీ కేంద్రాల్లో వర్షపు నీటి నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. గ్రామాల్లో మైక్రో వాటర్ ఫిల్టర్‌లను నిర్మించడంలో RWS ఇంజినీర్‌లు శ్రద్ద చూపడం లేదని కలెక్టర్ అన్నారు.

News July 4, 2025

మహనీయుల సేవలను స్మరించుకోవాలి: కలెక్టర్

image

మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో
శుక్రవారం నిర్వహించిన అల్లూరి సీతారామరాజు జయంతి, పింగళి వెంకయ్య వర్ధంతి కార్యక్రమాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి ఇరువురి మహనీయుల చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఆర్ఓ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.