News August 24, 2025
కృష్ణా: వర్షాలకు రోడ్లు ధ్వంసం.. నష్టం ఎంతంటే.!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. R&B అధికారుల అంచనాల మేరకు.. మొత్తం 333.32 కి.మీ మేర రోడ్లు పాడయ్యాయి. 14 రోడ్లు పూర్తిగా కొట్టుకుపోగా, ఒక రోడ్డు బాగా దెబ్బతింది. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి ఖర్చుల వివరాలు ఇలా ఉన్నాయి. తాత్కాలిక మరమ్మతులకు రూ. 33.09 కోట్లు, శాశ్వత పరిష్కారానికి రూ. 251.38 కోట్లు. ఈ నివేదికను అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు.
Similar News
News August 24, 2025
తిరుపతి: ఒక్కడే 53 బైకులు దొంగలించాడు!

తిరుపతిలో బైకులను మాయం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుచానూరుకు చెందిన P.కుమార్ సులభ్ కాంప్లెక్స్‌లో పనిచేస్తుంటాడు. జల్సాలకు అలవాటై దొంగతనాలు చేస్తున్నాడు. పాత రేణిగుంట రోడ్డులో జులై 6న బైక్ దొంగతనం జరిగింది. ఈ కేసులో దర్యాప్తు చేయగా కుమార్ పట్టుబడ్డాడు. తిరుపతి, చంద్రగిరి, ఏర్పేడు, శ్రీకాళహస్తి పరిధిలో రూ.40 లక్షల విలువైన 53 బైకులు దొంగలించగా వాటిని పోలీసులు రికవరీ చేశారు.
News August 24, 2025
KNR: కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ROUTE MAP

తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ అధ్యక్షతన సాయంత్రం రెండో విడత జనహిత పాదయాత్ర గంగాధర మం. ఉప్పరమల్యాల గ్రామం నుంచి కురిక్యాల వరకు, కురిక్యాల నుంచి మధురానగర్ X రోడ్ వరకు జరగనుంది. అనంతరం సాయంత్రం 7 గంటలకు మధురానగర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఉంటుందని చొప్పదండి MLA సత్యం తెలిపారు. మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు, పొన్నం, అడ్డూరి, వివేక్ తదితరులు పాల్గొననున్నారు.
News August 24, 2025
నరసన్నపేట: ఎరువుల దుకాణాల్లో ముమ్మర తనిఖీలు

నరసన్నపేట మండల కేంద్రంలో ఉన్న పలు ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ జిల్లా జేడీ త్రినాథ స్వామి తమ సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆదివారం జరిగిన ఈ సోదాల్లో ఏడీ వెంకట మధు, ఏవో సూర్య కుమారిలు ఉన్నారు. ఎరువులు బ్లాక్ మార్కెట్‌లోకి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని జేడీ దుకాణదారులకు హెచ్చరించారు. రైతులకు అందుబాటులో ఎల్లవేళలా ఎరువులు ఉంచాలన్నారు.