News October 16, 2024
కృష్ణా: వాయుగుండంగా బలపడిన అల్పపీడనం

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) తాజాగా ట్వీట్ చేసింది. సముద్ర తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. వాయుగుండం రేపు తెల్లవారు జామున చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.
Similar News
News December 19, 2025
పామాయిల్ సాగుపై రైతులను చైతన్య వంతులను చేయండి: కలెక్టర్

అధిక లాభాలు ఇచ్చే పామాయిల్ సాగుపై రైతుల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ డీకే బాలాజీ ప్రజాప్రతినిథులను కోరారు. శుక్రవారం జరిగిన డీఆర్సీ సమావేశంలో వ్యవసాయ శాఖపై జరిగిన చర్చలో ప్రత్యేకంగా పామాయిల్ సాగు వల్ల కలిగే లాభాలను కలెక్టర్ సమావేశానికి హాజరైన ప్రజా ప్రతినిథులకు వివరించారు. ప్రతి ఒక్క రైతు పామాయిల్ సాగుపై మరలేలా రైతులను ప్రోత్సహించాలన్నారు.
News December 19, 2025
కృష్ణా జిల్లాలో 15 మందికి కారుణ్య నియామకాలు

అంకితభావంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ డీకే బాలాజి కొత్తగా కారుణ్య నియామకాల కింద నియమితులైన ఉద్యోగులకు సూచించారు. శుక్రవారం ఉదయం తన చాంబర్‌లో 15 మందికి కారుణ్య నియామకాల కింద నియామక పత్రాలు అందజేశారు. నియామక పత్రాలు అందుకున్న వారిలో 9 మంది జూనియర్ అసిస్టెంట్లు, ఆరుగురు ఆఫీస్ సబార్డినేట్లు ఉన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మీకు అప్పగించిన పనులను సజావుగా నిర్వహించాలన్నారు.
News December 19, 2025
నేరాల నివారణే లక్ష్యం.. పోలీసుల గస్తీ

కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో పోలీసులు రాత్రివేళ ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించారు. ప్రార్థనా స్థలాలు, ఏటీఎంలు, వ్యాపార కేంద్రాలను తనిఖీ చేస్తూ భద్రతపై నిఘా ఉంచారు. హైవేలపై డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు, ‘ఫేస్ వాష్ & గో’ కార్యక్రమం ద్వారా వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఆపద సమయంలో డయల్ 100ను ఆశ్రయించాలని పోలీసులు ప్రజలకు సూచించారు.


