News November 21, 2024

కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో ఇటీవల నిర్వహించిన ఫార్మ్‌డీ కోర్సు 2, 3, 4వ ఏడాది పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఆయా పరీక్షలు రాసిన విద్యార్థులు రిజల్ట్స్ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ అధ్యాపక వర్గాలు సూచించాయి. ఈ పరీక్షల ఫలితాలకై యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చూడాలని విద్యార్థులకు ఈ మేరకు ఒక ప్రకటనలో సూచించాయి.

Similar News

News January 29, 2025

కృష్ణా: రూ.15 లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్‌

image

గన్నవరం నియోజకవర్గంలో ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా వారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గన్నవరం మండలం కొండపావులూరు శివారు ముదిరాజు పాలెంలో రూ.15లక్షల నిధులతో నిర్మించనున్న బీసీ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే, ఎంపీ శంకుస్థాపన చేశారు.

News January 28, 2025

పెనమలూరులో మృతదేహం కలకలం

image

పెనమలూరులో మృతదేహం కలకలం రేపింది. పెనమలూరు ఎస్సై ఉషారాణి.. తెలిపిన సమాచారం ప్రకారం తాడిగడప కాలువ గట్టు వద్ద సోమవారం సాయంత్రం మృతదేహం ఉందన్న సమాచారం మేరకు వెళ్లి పరిశీలించామన్నారు. ఈ క్రమంలో అక్కడ 35 నుంచి 40 సంవత్సరాల మగ మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉందన్నారు. మృతుడి వంటిపై నలుపు రంగు షర్టు, బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడని తెలిపారు.

News January 28, 2025

మచిలీపట్నం: మీకోసంలో 31 ఫిర్యాదులు

image

ప్రజా సమస్యలకు నిర్ణీత సమయంలో పరిష్కారమందించాలని ఎస్పీ ఆర్. గంగాధర్ రావు అన్నారు. సోమవారం మచిలీపట్నంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 31 ఫిర్యాదులు వచ్చాయని జిల్లా ఎస్పీ తెలిపారు. అనంతరం వాటి పరిష్కార మార్గాలు చూపారు.