News May 24, 2024

కృష్ణా: విద్యార్థులకు అలర్ట్..పరీక్షల నోటిఫికేషన్ విడుదల

image

కృష్ణా వర్సిటీ పరిధిలోని పీజీ- మాస్టర్ ఆఫ్ లా(LLM) కోర్స్ 3వ సెమిస్టర్ (2023-24 విద్యా సంవత్సరం) థియరీ పరీక్షలను జూన్ 28 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 25 నుంచి జూన్ 4వ తేదీలోపు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నాయి. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

Similar News

News October 12, 2024

కృష్ణా: ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే

image

దసరా ఉత్సవాల కోసం విజయవాడ(BZA) నుంచి శ్రీకాకుళం రోడ్(CHE) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను ఈ నెల 17 వరకు పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 12,14,15,16,17 తేదీల్లో BZA-CHE(నం.07215) మధ్య, 12,13,15,16,17 తేదీల్లో CHE-BZA(నం.07216) రైళ్లు నడుపుతామన్నారు. విజయవాడలో ఈ రైళ్లు పై తేదీల్లో రాత్రి 8 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 5.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటాయన్నారు.

News October 11, 2024

కృష్ణా: విమాన ప్రయాణికులకు శుభవార్త

image

విశాఖపట్నం నుంచి విజయవాడకు రాకపోకలు సాగించే ప్రయాణికుల సౌకర్యార్థం అక్టోబర్ 27న కొత్త విమాన సర్వీసును ప్రవేశపెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశాయి. ఏపీ ఎయిర్‌ ప్యాసింజర్స్‌ అసోసియేషన్‌ అభ్యర్థన మేరకు ఈ నెల 27 నుంచి ఈ నగరాల మధ్య అదనపు విమాన సర్వీసును అందుబాటులోకి తెస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు. ప్రస్తుతం విశాఖ నుంచి విజయవాడకు నేరుగా ఒక విమానం మాత్రమే అందుబాటులో ఉంది.

News October 11, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

ప్రయాణికుల రద్దీ మేరకు ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా సంబల్‌పూర్(SBP), ఈరోడ్(ED) మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ స్పెషల్ ట్రైన్స్ నవంబర్ 27 వరకు ప్రతి బుధవారం SBP-ED(నం.08311), నవంబర్ 29 వరకు ప్రతి శుక్రవారం ED-SPB(నం.08312) మధ్య నడుపుతున్నామన్నారు. కాగా ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కైకలూరు, గుడివాడ, విజయవాడతో పాటు ఏపీలో పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి.