News February 9, 2026
కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. నేటితో ముగియనున్న ఫీజు చెల్లింపు గడువు

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో OCT 2025లో నిర్వహించిన బీటెక్ 7వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 9లోపు ఒక్కో పేపరుకు రూ.1,000 https://onlinesbi.com ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుందని వర్శిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ పి. వీరబ్రహ్మచారి సూచించారు.
Similar News
News February 19, 2026
చిరుప్రాయంలో గుండెకోత.. ఆదుకోండి

వైరా(M) తాటిపూడికి చెందిన కట్టా రామకృష్ణ మూడేళ్ల కుమారుడు శ్రీహర్ష ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.18రోజులుగా గుండెసమస్యతో బాధపడుతున్న ఈ చిన్నారి,HYDలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. వైద్యానికి రూ. 22.70 లక్షలు ఖర్చవుతాయని, అంత స్తోమత తమకు లేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉదారహృదయులు ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
News February 19, 2026
ప్రతి జిల్లాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్: హోంమంత్రి అనిత

సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రతి జిల్లాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. గురువారం శాసనసభలో మాట్లాడారు. సైబర్ వర్టికల్ వింగ్ ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు పంపించామన్నారు. రూ.2కోట్లతో అధునాతనమైన సైబర్ ఫోరెన్సిక్ పరికరాలను సమకూరుస్తున్నామని చెప్పారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
News February 19, 2026
నెలసరికి ముందు ఇవి మేలు..

నెలసరికి ముందు ఆడవారి శరీరంలో అనేక మార్పులు వస్తాయి. వీటి వల్ల ఒళ్లు బరువుగా ఉండటం, కడుపు నొప్పి, రొమ్ముల సలపరం వేధిస్తాయి. దీన్నే ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. ఈ లక్షణాలు తగ్గించడానికి డైట్‌లో డ్రైఫ్రూట్స్, మిల్లెట్స్, పెసలు, అలసందలు చేర్చుకోవాలి. శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న ఆహారాలు, కూల్ డ్రింక్స్, కాఫీలు ఎక్కువగా తీసుకుంటే నెలసరి సమస్యలు మరింత పెరుగుతాయంటున్నారు నిపుణులు.


