News March 28, 2024
కృష్ణా: విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు ముఖ్య గమనిక
ట్రాక్ నిర్వహణ మరమ్మతులు జరుగుతున్నందున మచిలీపట్నం- విశాఖపట్నం మధ్య ప్రయాణించే ఎక్స్‌ప్రెస్ ట్రైన్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నెం.17220 విశాఖపట్నం- మచిలీపట్నం ట్రైన్‌ను ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 29 వరకు, నెం.17219 మచిలీపట్నం- విశాఖపట్నం ట్రైన్‌ను ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 28 వరకు రద్దు చేస్తున్నామని రైల్వే శాఖ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
Similar News
News December 28, 2024
ఇబ్రహీంపట్నం: బాలికపై పాస్టర్ అత్యాచారం.. కేసు నమోదు
బాలికపై అత్యాచారానికి పాల్పడిన పాస్టర్‌ని ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. కొండపల్లిలో నివాసముంటున్న బాలిక కుటుంబానికి పాస్టర్ దగ్గరి బంధువు. తెలంగాణ నుంచి అప్పుడప్పుడు కొండపల్లిలోని బాలిక నివాసానికి వచ్చి అత్యాచారానికి పాల్పడేవాడు. బాలిక ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News December 28, 2024
VJA: మైనర్ బాలికపై అత్యాచారం.. యువకుడు అరెస్ట్
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. సీఐ కొండలరావు తెలిపిన సమాచారం మేరకు.. చిట్టినగర్‌కు చెందిన ఓ మైనర్ బాలిక(14)ను వించిపేటకు చెందిన చెన్నా రవీంద్ర అనే యువకుడు మాయమాటలు చెప్పి ఈనెల 26న అత్యాచారం చేసినట్లు బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ కొండలరావు తెలిపారు.
News December 28, 2024
కృష్ణా: పరీక్షల టైం టేబుల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీ.ఆర్క్) కోర్స్ 5వ ఏడాది చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2025 జనవరి 7, 9 తేదీలలో ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు ఈ పరీక్షలు జరుగుతాయని పరీక్షల విభాగ కంట్రోలర్ ఏ.శివప్రసాదరావు ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడాలన్నారు.