News June 28, 2024

కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతి రాజీనామా

image

కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతి గొల్లా జ్ఞానమణి శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మౌఖిక ఆదేశాల మేరకు వైస్ ఛాన్స్‌లర్ పదవిలో ఉన్న జ్ఞానమణి రాజీనామా చేసినట్లు తాజాగా సమాచారం వెలువడింది. కాగా 2023 సంవత్సరం ద్వితీయార్థంలో కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతిగా జ్ఞానమణి నియామకమయ్యారు.

Similar News

News November 27, 2024

కృష్ణా: విద్యార్థులకు గమనిక.. పరీక్ష కేంద్రాలలో మార్పులు

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో నిర్వహిస్తున్న 2వ సెమిస్టర్ బీఈడీ, స్పెషల్ బీఈడీ పరీక్ష కేంద్రాలలో స్వల్ప మార్పులు చేశామని KRU తెలిపింది. యూనివర్సిటీ పరిధిలోని 7 కేంద్రాలలో బీఈడీ, ఒక కేంద్రంలో స్పెషల్ బీఈడీ పరీక్షలు జరుగుతాయని తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షల రివైజ్డ్ కేంద్రాల వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.

News November 27, 2024

కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. నోటిఫికేషన్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో ఆగస్టు 2024లో నిర్వహించిన బీఈడీ, స్పెషల్ బీఈడీ 1వ సెమిస్టర్ పరీక్షలకు(2023-24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు డిసెంబర్ 2లోపు ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపుకై https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలంది. 

News November 27, 2024

కృష్ణా: ధాన్యం విక్రయాలకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ 

image

జిల్లాలో ఖరీఫ్ ధాన్యం విక్రయాలకు సంబంధించి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ధాన్యం విక్రయాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు ఉన్నా 8247693551 నంబర్‌కి ఫోన్ చేసి తెలియపర్చవచ్చన్నారు.