News March 27, 2024
కృష్ణా: వైసీపీలో చేరిన జనసేన కీలక నేత

ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన కీలక నేత బత్తిన రాము మంగళవారం వైసీపీలో జాయిన్ అయ్యారు. ఈయన బత్తిన ట్రాన్స్‌ఫోర్ట్ అధినేత. గతంలో ఈయన ప్రజారాజ్యం తరఫున గన్నవరం నియోజవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. జనసేన నుంచి గత ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చెందారు. నిన్న ఆయన కేశినేని నానితో సీఎం జగన్‌ను కలిసి వైసీపీలో చేరారు.
Similar News
News July 5, 2025
ఫెన్సింగ్ పోటీల్లో కృష్ణా జిల్లా క్రీడాకారుల ప్రతిభ

మహారాష్ట్రలోని నాసిక్‌లో జరుగుతున్న 9వ జాతీయ ఫెన్సింగ్ పోటీల్లో కృష్ణా జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో వారు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ పోటీలకు ఎంపికైనట్లు కోచ్ విజయ్ తెలిపారు. జాతీయ ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనడం ద్వారా జిల్లా క్రీడా కారులు తమ ప్రతిభను దేశస్థాయిలో చాటుకున్నారని కోచ్ చెప్పారు.
News July 5, 2025
పీ-4 కార్యక్రమం నిర్వహణకు కలెక్టర్ ఆదేశాలు

పీ-4, స్వర్ణాంధ్ర-2047 కార్యక్రమాల అమలులో భాగంగా, ఆగస్టు 15వ తేదీలోగా బంగారు కుటుంబాల అనుసంధాన ప్రక్రియను పూర్తిచేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ ‘మీ-కోసం’ సమావేశ మందిరంలో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటికే 67 వేల బంగారు కుటుంబాలను గుర్తించినట్లు తెలిపారు.
News July 5, 2025
సహకార వ్యవస్థ బలోపేతానికి కృషి: కలెక్టర్

కృష్ణా జిల్లాలో సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు సహకార సంస్థలు సమ్మిళితమై స్థిరమైన అభివృద్ధి మార్గాలతో మెరుగైన ప్రపంచాన్ని నిర్మించేందుకు ముందుకు రావాలని కలెక్టర్ బాలాజీ పిలుపునిచ్చారు. జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో శనివారం నిర్వహించిన 103వ అంతర్జాతీయ సహకార దినోత్సవంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ముందుగా కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటి, సహకార సంఘాల పతాకాన్ని ఎగురవేశారు.