News December 18, 2024

కృష్ణా: శబరిమలై ప్రయాణికుల కోసం 4 ప్రత్యేక రైళ్లు

image

శబరిమలై వెళ్లేవారికై నరసాపురం(NS)- కొల్లామ్‌(QLN) మధ్య 4 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ PRO ఏ.శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు 2025 JAN 15, 22న NS- QLN(నం.07183), JAN 17, 24న QLN- NS(నం.07184) రైళ్లు నడుతున్నామన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కైకలూరు, గుడివాడ, విజయవాడ స్టేషన్లలో ఆగుతాయని అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

Similar News

News September 14, 2025

కృష్ణా జిల్లా ఎస్పీ నేపథ్యం ఇదే.!

image

33 ఏళ్ల వయసులోనే 4 జిల్లాల్లో SPగా విధులు నిర్వహించి ప్రజాదరణ పొందిన యువ ఐపీఎస్ వానస విద్యాసాగర్ నాయుడు ప్రతిభతో ఆకట్టుకుంటున్నారు. నరసాపురానికి చెందిన ఆయన కోచింగ్ లేకుండానే సివిల్స్‌లో 101వ ర్యాంకు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారు. “మన ఊరు మన పోలీస్” వంటి వినూత్న కార్యక్రమాలతో క్రైమ్ రేటు తగ్గించి, రాష్ట్రంలో గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు కృష్ణా జిల్లా SPగా ఆయన విధులు నిర్వహించనున్నారు.

News September 14, 2025

కంకిపాడు: మోడరన్ పెంటాథలాన్ జట్ల ఎంపికలు నేడే

image

కంకిపాడు మండలం ఈడుపుగల్లులోని ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో కృష్ణా జిల్లా మోడరన్ పెంటాథలాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా బాలబాలికల జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎంపికలు ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని అసోసియేషన్ కార్యదర్శి సురేంద్ర తెలిపారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు సెప్టెంబర్ 20, 21 తేదీల్లో కాకినాడలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన చెప్పారు.

News September 14, 2025

మచిలీపట్నంలో కేజీ చికెన్ ధర ఎంతంటే.?

image

మచిలీపట్నంలో ఆదివారం చికెన్, మటన్ ధరలు ఇలా ఉన్నాయి. పట్టణంలో చికెన్ విత్ స్కిన్ కిలో రూ.220, స్కిన్‌లెస్ కిలో రూ.240కు విక్రయాలు జరుగుతున్నాయి. అదే ధరలు గ్రామాల్లో ఎక్కువగా ఉండి స్కిన్ ఉన్న చికెన్ కిలో రూ.240, స్కిన్‌లెస్ రూ.260కు అమ్ముతున్నారు. మటన్ కిలో రూ.1000గా ఉండగా, గ్రామాల్లో మాత్రం కిలో రూ.800కి విక్రయాలు జరుగుతున్నాయి.