News August 30, 2024
కృష్ణా: సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున వర్సిటీ(ANUCDE)లో డిస్టెన్స్ విధానంలో UG, PG కోర్సులు చదివే విద్యార్థులు(A-21, A-22, A-23& C-21, C-22,C-23 బ్యాచ్‌లు) రాయాల్సిన 1వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడులైంది. ఈ పరీక్షలు సెప్టెంబర్ 27 నుంచి నిర్వహిస్తామని, విద్యార్థులు పరీక్ష ఫీజును అపరాధ రుసుము లేకుండా సెప్టెంబర్ 2లోపు చెల్లించాలని వర్సిటీ సూచించింది. వివరాలకు http://anucde.info/అధికారిక వెబ్‌సైట్ చూడాలంది.
Similar News
News September 17, 2025
MTM: YS జగన్ ఫొటోలతో సర్టిఫికేట్లు.. ఉద్యోగులు సస్పెండ్

బందరు మండలం తాళ్లపాలెం పంచాయతీ పరిథిలో మాజీ సీఎం జగన్ ఫొటోతో ఉన్న కుల, ఆదాయ సర్టిఫికేట్లు జారీ చేసిన ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ పెద్దింట్లమ్మ, పంచాయతీ కార్యదర్శి రవి శంకర్‌లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
News September 16, 2025
బందరు: జగన్ ఫోటోతో INCOME సర్టిఫికేట్ జారీ

బందరు మండలం తాళ్లపాలెం సచివాలయంలో మాజీ సీఎం జగన్ ఫోటోతో ఇన్‌కమ్ సర్టిఫికేట్ జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రభుత్వం మారినా రాష్ట్రంలో అక్కడక్కడ జగన్ ఫోటోలతో కూడిన సర్టిఫికేట్లు జారీ అవుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల గుంటూరులో జగన్ ఫోటోతో సచివాలయ సిబ్బంది సర్టిఫికేట్ జారీ చేయడాన్ని మరువక ముందే నేడు బందరు మండలం తాళ్లపాలెం సచివాలయంలో జగన్ ఫోటోతో సర్టిఫికేట్ జారీ విమర్శలకు తావిస్తోంది.
News September 16, 2025
దేవుడి భూములను కొట్టేస్తే సమగ్ర విచారణ చేసుకోండి – పేర్ని నాని

మచిలీపట్నంలోని రంగనాయక స్వామి దేవస్థానంకు చెందిన భూములను తాను కారు చౌకగా కొట్టేశానని కూటమి నేతలు చేస్తున్న విమర్శలపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. నిజంగా స్వామి వారి భూములను తాను అక్రమ మార్గంలో తీసుకుంటే నాడు జరిగిన వేలంపాటపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ అవినీతిని తాను బట్టబయలు చేస్తుండటంతో తనపై కక్ష కట్టి అవినీతి ఆరోపణలు చేస్తున్నారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.