News September 28, 2024

కృష్ణా: సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున వర్సిటీ పరిధిలోని కాలేజీలలో ఎం-ఫార్మసీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ థియరీ పరీక్షల (సప్లిమెంటరీ) టైం టేబుల్ విడుదలైంది. అక్టోబర్ 18, 21, 23, 25 తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

Similar News

News November 7, 2025

త్వరలో గుడివాడకు వందే భారత్ రైలు

image

చెన్నై – విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవను గుడివాడ, భీమవరం టౌన్ మీదుగా నరసాపురం వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విస్తరణతో ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకు ఇది ఎంతో ప్రయోజనకరం.

News November 7, 2025

గన్నవరంలో యాక్టీవ్ అవుతున్న వల్లభనేని వంశీ

image

గన్నవవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నియోజకవర్గంలో యాక్టీవ్ అవుతున్నారు. నకిలీ పట్టాల కేసులో జైలు నుంచి విడుదలైన తర్వాత వంశీ పొలిటికల్‌గా సైలెంట్ అయిపోయారు. ఒకానొక దశలో వంశీ పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకున్నారన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇటీవల వై.ఎస్ జగన్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు వంశీ కూడా పాల్గొన్నారు. నియోజకవర్గంలోనూ చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

News November 7, 2025

పాడి పరిశ్రమ అభివృద్ధిలో పశు వైద్యుల పాత్ర ఘనమైనది: కలెక్టర్

image

పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం అభివృద్ధిలో పశు వైద్యుల పాత్ర ఎంతో ఘనమైనదని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ప్రజల జీవనోపాదులను మెరుగుపరచడంలో మరింత కృషి చేయాలన్నారు. గురువారం కలెక్టరేట్‌లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ పశువుల మిషన్-శాస్త్రీయ నిర్వహణ గొర్రెలు, మేకల పెంపకం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.