News March 22, 2025

కృష్ణా: 10వ తరగతి ఓరియంటల్ పరీక్షకు 99.82% హాజరు 

image

కృష్ణా జిల్లాలో శనివారం నిర్వహించిన 10వ తరగతి ఓరియంటల్ పరీక్షకు 99.82% మంది విద్యార్థులు హాజరైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు తెలిపారు. 5,581 మంది విద్యార్థులకు గాను 5,571 మంది హాజరయ్యారని, 10 మంది గైర్హాజరైనట్టు డీఈఓ తెలిపారు. పలు పరీక్షా కేంద్రాలను స్క్వాడ్ టీములు పరిశీలించగా ఎక్కడా కూడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు. 

Similar News

News March 23, 2025

విజయవాడలో దుమారం రేపుతున్న బ్యానర్

image

విజయవాడ మొగల్రాజపురంలోని జమ్మి చెట్టు సెంటర్ వద్ద జగన్ ఫోటోతో వినూత్నంగా ఓ బ్యానర్ వెలిసింది. వైఎస్ జగన్ ఫోటోను వేసి కోడి కత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అంటూ బ్యానర్ ఏర్పాటు చేశారు. దీనిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. బ్యానర్ తొలగించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ బ్యానర్ విజయవాడలో దూమారం రేపుతోంది.

News March 23, 2025

VJA: పెళ్లి అయిన 9 రోజులకే మృతి

image

పెళ్లి అయిన 9 రోజులకే డాక్టర్ మృతి చెందిన విషాద ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలుకు చెందిన శివాచారి(32) డాక్టర్ చదువుకుని పెదకాకాని మండలంలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులు ఈనెల 13న లావణ్యతో వివాహం చేశారు. దీంతో రెండు రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. వెంటనే విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

News March 23, 2025

ఈనెల 30న కృష్ణా జిల్లాకు సీఎం చంద్రబాబు 

image

సీఎం చంద్రబాబు ఈనెల 30వ తేదీన కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఉంగుటూరు మండలంలోని ఆత్కూర్ స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో జరిగే ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. 30వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమక్షంలో ఈ ఉగాది సంబరాలు జరగనున్నాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా చంద్రబాబు హాజరుకానున్నారు. 

error: Content is protected !!