News September 19, 2024
కృష్ణా: 100 రోజుల పాలనపై మీ కామెంట్.?
ఉమ్మడి కృష్ణా జిల్లాలో అన్ని సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ రేపటితో 100 రోజులు పాలన పూర్తి చేసుకోనుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని ఈ నెల 26 వరకు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించనున్నారు. పింఛన్ పెంపు, అన్నక్యాంటీన్లు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని YCP విమర్శిస్తోంది. 100 రోజుల పాలన, మీ ఎమ్మెల్యే పనితీరుపై మీ కామెంట్..
Similar News
News November 24, 2024
విద్యాసంస్థలకు కృష్ణా జిల్లా కలెక్టర్ హెచ్చరిక
ఫీజు బకాయిల పేరిట విద్యార్థులను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీలోని జిల్లా కలెక్టర్లు స్పందించారు. తమ పరిధిలోని ప్రైవేటు విద్యా సంస్థలకు పలు సూచనలు చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఈ సందర్భంగా తన సహచర శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థులను ఎలాంటి ఒత్తిడికి గురికానివ్వొద్దని సూచించారు.
News November 24, 2024
బుడమేరుకు మళ్లీ గండ్లు.. అధికారుల స్పందన
బుడమేరుకు సెప్టెంబర్‌లో గండ్లు పడ్డ ప్రాంతంలో మళ్లీ గండ్లు పడ్డాయని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతుండగా.. వాటిపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ ట్విట్టర్‌లో స్పందించింది. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా పోస్టులు పెడుతున్న వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని తమ అధికారిక ఖాతాలో తాజాగా హెచ్చరించింది. ఈ తరహా పోస్టులతో ప్రజలలో అలజడి రేపుతున్నారని, చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
News November 24, 2024
విషాదం.. ఇద్దరు చిన్నారులు మృతి
ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఆదివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఏలూరు కాలువలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. తల్లిదండ్రులతో పాటు కాలువలో బట్టలు ఉతకడానికి వెళ్లారు. ఈ క్రమంలో పిల్లలు కాలువలో దిగి ఆడుతూ లోతుకి వెళ్లారు. వారిని బయటకి తీసుకువచ్చే లోపు వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.