News June 21, 2024
కృష్ణా: 2019, 2024లో అసెంబ్లీలో అడుగుపెట్టింది వీరే
ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి 2019, 2024లో శాసనసభలో ముగ్గురు మాత్రమే అడుగుపెట్టారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందిన పార్థసారథి, వసంత కృష్ణప్రసాద్ ఈ సారి నూజివీడు, మైలవరం నియోజకవర్గాల టీడీపీ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్లనున్నారు. 2019తో పాటు తాజా ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి టీడీపీ తరఫున గెలుపొందిన గద్దె రామ్మోహన్ మరోమారు అసెంబ్లీకి వెళ్లారు.
Similar News
News November 28, 2024
నేడు విజయవాడకు రానున్న ‘దేవకీనందన వాసుదేవ’ టీమ్
“దేవకీనందన వాసుదేవ” చిత్రబృందం నేడు విజయవాడ రానున్నారు. చిత్ర హీరో గల్లా అశోక్‌తో పాటు ఈ చిత్రంలో నటించిన పలువురు ఈరోజు సాయంత్రం 5 గంటలకు విజయవాడ చేరుకుంటారని కార్యక్రమ నిర్వాహకులు ఒక ప్రకటన విడుదల చేశారు. గురునానక్ కాలనీలోని సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం నుంచి ట్రెండ్‌సెట్ మాల్ వరకు మూవీ టీం ర్యాలీ, అనంతరం 6 గంటలకు ట్రెండ్‌సెట్ మాల్‌లో కేక్ కటింగ్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
News November 27, 2024
కృష్ణా: విద్యార్థులకు గమనిక.. పరీక్ష కేంద్రాలలో మార్పులు
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో నిర్వహిస్తున్న 2వ సెమిస్టర్ బీఈడీ, స్పెషల్ బీఈడీ పరీక్ష కేంద్రాలలో స్వల్ప మార్పులు చేశామని KRU తెలిపింది. యూనివర్సిటీ పరిధిలోని 7 కేంద్రాలలో బీఈడీ, ఒక కేంద్రంలో స్పెషల్ బీఈడీ పరీక్షలు జరుగుతాయని తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షల రివైజ్డ్ కేంద్రాల వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.
News November 27, 2024
కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. నోటిఫికేషన్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో ఆగస్టు 2024లో నిర్వహించిన బీఈడీ, స్పెషల్ బీఈడీ 1వ సెమిస్టర్ పరీక్షలకు(2023-24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు డిసెంబర్ 2లోపు ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపుకై https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలంది.