News February 24, 2025
కృష్ణా: 25న జిల్లా సబ్ జూనియర్ ఫెన్సింగ్ జట్ల ఎంపికలు

వీరులపాడు మండలం పొన్నవరంలోని ఏకత్వా పాఠశాలలో అండర్-14 బాల, బాలికల ఉమ్మడి కృష్ణా జిల్లా ఫెన్సింగ్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఆదివారం జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి నాగం సతీష్ బాబు తెలిపారు. ఈ ఎంపికలు ఈ నెల 25న మధ్యాహ్నం 2గంటలకు నిర్వహించనున్నట్లు వివరించారు. జిల్లాలో ఆసక్తి గల క్రీడాకారులు FAI గుర్తింపు కార్డు, ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలన్నారు.
Similar News
News February 23, 2025
కృష్ణాజిల్లా TODAY TOP NEWS

*జగన్‌పై మంత్రి కొల్లు ఫైర్
*జగన్ మద్దతు కావాలి- MLC అభ్యర్థి
*కృష్ణా యూనివర్శిటీ వీసీగా రాంజీ
*పెనమలూరులో మంత్రుల భేటీ
*పోలవరం లాకుల వద్ద ఇద్దరి మృతి
*ఉయ్యూరులో పోటెత్తిన <<15552020>>భక్తులు<<>>
News February 23, 2025
ఉమామహేశ్వరాలయానికి రూ.55.25 లక్షలు మంజూరు

గూడూరు మండలంలోని కంకటావ గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర వెంకటాచల వేణుగోపాల స్వామి దేవస్థానం పునరుద్ధరణకు రూ.55.25 లక్షలు మంజూరయ్యాయి. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అభ్యర్థన మేరకు దేవదాయ శాఖ ఈ నిధులను మంజూరు చేసినట్లు పలువురు పేర్కొన్నారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ ఆదేశాలను జారీ చేయడంతో గ్రామస్థులు, పెద్దలు వారికి ఆదివారం కృతజ్ఞతలు తెలిపారు.
News February 23, 2025
కృష్ణా జిల్లాలో విషాదం.. ఇద్దరి మృతి

కృష్ణా జిల్లాలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. పోలవరం లాకులు కొమ్మూరు వద్ద నీటిలో పడి ఇద్దరు యువకులు మరణించారు. వీరవల్లి ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ నాగూర్ బాషా (16), షేక్ షరీఫ్ (16) తన తండ్రితో కలిసి చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో వారు ఇద్దరూ కాలుజారి నీటిలో పడిపోయారు. వారిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ వారు మరణించారు. పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు.