News December 5, 2025
కృష్ణా: 48 వేల అపార్ ఐడిలు పెండింగ్.!

విద్యార్థుల వివరాలు, సర్టిఫికెట్ల డిజిటలైజేషన్ కోసం తప్పనిసరి చేసిన 12 అంకెల ‘అపార్ ఐడీ’ నమోదు ప్రక్రియలో ఆధార్, పుట్టిన తేదీ లోపాల కారణంగా NTR జిల్లాలో 37 వేలు, కృష్ణా జిల్లాలో 11 వేల మందికి పైగా వివరాలు నమోదు కాలేదు. దీంతో, తప్పులు సరిదిద్దే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లు ఆర్డీఓలు, ఎంఆర్‌ఓలకు ఆదేశాలు జారీ చేశారు. అపార్ ఐడీతో దొంగ సర్టిఫికెట్లకు అడ్డుకట్ట పడుతుందని తెలిపారు.
Similar News
News December 5, 2025
ఎన్నికల భద్రతపై సమీక్షించిన సీపీ

కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల భద్రతపై కరీంనగర్ సీపీ గౌష్ ఆలం పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు 104 రూట్లు, 57 క్లస్టర్లను ఏర్పాటు, 508 మళ్లీ సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని, భద్రతా ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
News December 5, 2025
అఖండ-2 వాయిదా.. బాలయ్య తీవ్ర ఆగ్రహం?

అఖండ-2 సినిమా రిలీజ్‌ను <<18473406>>వాయిదా<<>> వేయడంపై బాలకృష్ణ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఫైనాన్స్ ఇబ్బందులను దాచడంపై నిర్మాతలతోపాటు డైరెక్టర్ బోయపాటిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అభిమానులతో ఆటలు వద్దని, సాయంత్రంలోపు విడుదల కావాల్సిందేనని పట్టుబట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అప్పటికప్పుడు బడా ప్రొడ్యూసర్లు 14 రీల్స్ నిర్మాతలకు కొంత సాయం చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.
News December 5, 2025
ఒత్తిడికి లోనుకాకుండా చదవాలి: కలెక్టర్

తాళ్లపూడి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన మెగా PTM 3.0ను కలెక్టర్ కీర్తి చేకూరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అన్నదేవరపేట ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూల్, అన్నదేవరపేట ప్రభుత్వ హైస్కూల్, వేగేశ్వరపురం ప్రభుత్వ హైస్కూల్‌లను సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్.. ఒత్తిడికి లోనుకాకుండా చదవాలని, వెనుకబడిన సబ్జెక్టుల్లో ప్రత్యేక తరగతులకు హాజరు కావాలని విద్యార్థులకు సూచించారు.


