News October 12, 2025

కృష్ణా: APTATS యాప్ మద్యం ప్రియుల భద్రతకు కవచం

image

విజయవాడ సమీపంలోని ములకలచెరువులో కల్తీ మద్యం కేసు కలకలం రేపిన నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజల భద్రత కోసం “APTATS” అనే యాప్‌ విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా మద్యం అసలైనదో, కల్తీదో సులభంగా తెలుసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా మద్యం విక్రయాలపై పర్యవేక్షణ బలపడటమే కాకుండా, కల్తీ మద్యం తయారీదారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Similar News

News October 12, 2025

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: KMR కలెక్టర్

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో ప్రజావాణి యథావిధిగా ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా ప్రజావాణిలో అందించాలన్నారు.

News October 12, 2025

జూబ్లీహిల్స్‌‌ బైపోల్‌.. ఓటర్ 50-50!

image

HYDలో ఎన్నికలు అంటే నేతల్లో హడావిడి మామూలుగా ఉండదు. ప్రచారంలో పోటాపోటీ కనిపిస్తుంది. కానీ, ఇంత ఆర్భాటం చేసినా ఓటరు మహాశయులు సిటీలో ఎలక్షన్స్ అంటే దూరంగా ఉంటారు. జూబ్లీహిల్స్‌‌లో ఈ పరిస్థితి మరీ ఎక్కువ. 2023 ఎన్నికల్లోనూ ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు కృషి చేసినా 50% శాతానికే పరిమితం అయ్యింది. ఇక ఈ బైపోల్‌‌లో అయినా ఓటర్లు పోలింగ్‌‌కు వస్తారా? ఎప్పటిలాగే 50-50 అంటారా అనేది వేచి చూడాల్సిందే.