News October 30, 2024
కృష్ణా: LLB 9వ సెమిస్టర్ టైంటేబుల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో అయిదేళ్ల LLB కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 9వ సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ) థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. నవంబర్ 19, 21, 23, 25, 27వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 70 మార్కులకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగం తెలిపింది. పూర్తి వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చు.
Similar News
News February 12, 2026
రాష్ట్ర సెక్రటేరియట్‌లో కృష్ణా జిల్లా ప్రణాళికలపై చర్చ

కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ అధ్యక్షతన గురువారం రాష్ట్ర సచివాలయంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిథుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి కొల్లు రవీంద్రతోపాటు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావ్, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, బోడే ప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్ రాజా, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు జిల్లా అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు.
News February 12, 2026
నేడు కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం

మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కొల్లు రవీంద్ర, బుద్ధప్రసాద్, బోడె ప్రసాద్, వెంకట్రావు, రాము, కృష్ణప్రసాద్, కుమార్ రాజా పాల్గొననున్నారు. కృష్ణా జిల్లా అభివృద్ధి, నియోజకవర్గాల్లో పెండింగ్ పనులు, ప్రజా సమస్యలపై చర్చించనున్నారు. జిల్లాలో చేపట్టాల్సిన ప్రాధాన్య ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధిపై సమీక్ష జరగనుంది.
News February 12, 2026
Way2 ఎఫెక్ట్.. యానాది కుటుంబాలకు విముక్తి

నాగయలంక మండలం ఈలచెట్లదిబ్బలో యానాది కుటుంబాలతో వెట్టిచాకిరి చేపిస్తున్న ఘటనపై Way2Newsలో ‘<<19085249>>మాకు విముక్తి కల్పించండి సార్<<>>’ అనే వార్త పబ్లిష్ అయ్యింది. దీంతో స్పందించిన అధికారులు విచారణ చేసి 27 యానాది సంచార కుటుంబాలను పరిశీలించగా, 11 కుటుంబాలకు విముక్తి కల్పించి స్వగ్రామాలకు తరలించారు. అక్రమంగా తరలిస్తున్న దళారులను పోలీసులు అడ్డుకున్నారు. మిగిలిన 16 కుటుంబాలు ఇక్కడే ఉంటామని తెలిపాయి.


