News July 4, 2025

కృష్ణా: LLM 2వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో LLM 2వ సెమిస్టర్ (2024-25 విద్యాసంవత్సరం) థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు ఆగస్టు 26 నుంచి జరగనున్నాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు జులై 10 నుంచి 21 లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్ https://kru.ac.in/ ను సందర్శించవచ్చు.

Similar News

News July 4, 2025

విశాఖ జిల్లాలో 636 పాఠశాల్లో వైద్య పరీక్షలు

image

DMHO జగదీశ్వరరావు ఆదేశాల మేరకు విశాఖలో పాఠశాల విద్యార్థులకు జూలై 3నుంచి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం పలు పాఠశాలు, అంగన్వాడీ కేంద్రాలలో మెడికల్ ఆఫీసర్, ఎఎన్ఎమ్‌లు ఆరోగ్య పరీక్షలు చేశారు. పిల్లల్లో పుట్టుకతో వచ్చే శారీరక ,మానసిక లోపాలను గుర్తించి సరైన వైద్యసేవలను ఇవ్వనున్నారు. జిల్లాలో 636 పాఠశాలల్లో 96,159 మంది, 914 అంగన్వాడీలలో 56,371 మందికి పరీక్షలు చేస్తారు.

News July 4, 2025

విశాఖ జిల్లా టీచర్లకు గమనిక

image

జాతీయ స్థాయి ఉత్తమ ఉపాద్యాయ అవార్డులు 2025‌కు ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రభుత్వ/ ప్రైవేటు/ ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ప్రేమ్ కుమార్ శుక్రవారం తెలిపారు. http://nationalawardstoteacher.education.gov.in వెబ్‌సైట్ ద్వారా జులై 13లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అర్హత, వివరాలకు వెబ్ సైట్‌లో చెక్ చేసుకోవాలని తెలిపారు.

News July 4, 2025

నిర్మల్: తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం

image

తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఆర్థిక, సామాజిక కారణాలతో చదువు మధ్యలో ఆపేసిన వారికి, లేదా ఉద్యోగం చేస్తూ చదువుకోవాలనుకునే వారికి ఇది సువర్ణావకాశం. అడ్మిషన్లు జూన్ 12 నుంచి ఆగస్టు 12 వరకు www.telanganaopenschool.org వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. SHARE IT