News August 13, 2025

కృష్ణా, NTR జిల్లాల పేర్లు మారుస్తారా?

image

జిల్లాల పునర్విభజనపై AP క్యాబినెట్ సబ్‌ కమిటీ బుధవారం సమావేశం కానుంది. ఈ సమావేశంలో జిల్లాల పేర్లు, సరిహద్దులు మార్పులపై చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో నూజివీడు, గన్నవరం, పెనమలూరును NTR జిల్లాలో, కైకలూరును కృష్ణా జిల్లాలో నందిగామ, జగ్గయ్యపేటలను అమరావతిలో కలపనున్నట్లు తెలుస్తోంది. ఇలా ఉండగా NTR జిల్లాను విజయవాడగా మారుస్తారా! కృష్ణా జిల్లాకు NTR జిల్లా పేరు పెడతారా అనే చర్చ జరుగుతోంది. దీనిపై మీ కామెంట్.

Similar News

News August 13, 2025

MBNR: డిగ్రీ, PGలో అడ్మిషన్లు.. నేడే లాస్ట్

image

బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ యూజీ, పీజీలో అడ్మిషన్లకు నేడు చివరి తేదీ అని ఉమ్మడి పాలమూరు జిల్లా ఓపెన్ యూనివర్సిటీ రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ గౌడ్ Way2Newsతో తెలిపారు. రెగ్యూలర్‌గా కాలేజీకి వెళ్లి చదవలేని విద్యార్థులు, ఉద్యోగులకు ఓపెన్ యూనివర్సిటీ ఒక మంచి అవకాశం అని సూచించారు. పూర్తి వివరాలకు https://braou.ac.in వెబ్ సైట్‌ను సందర్శించాలన్నారు.

News August 13, 2025

MBNR: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై నిఘా

image

రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇప్పటికే లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. MBNR-10,904, NGKL-8,525, WNPT-6,538, GDWL-6,488, NRPT- 5,233 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణం చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 36,224 మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందుకున్నారు.

News August 13, 2025

భద్రాచలం ఆలయానికి ISO గుర్తింపు

image

భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి ఐఎస్ఓ గుర్తింపు లభించింది. 19001 ప్రమాణ స్థాయిలను పాటించేటటువంటి 22000 ఆహార భద్రత నిర్వహణ స్థాయి పాటించే గుర్తింపు లభించింది. మంత్రి కొండా సురేఖ చేతులు మీదుగా దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఎల్ రమాదేవి అందుకున్నారు. ఈ సర్టిఫికెట్‌ను ఐఎస్ఓ డైరెక్టర్ శివయ్య అందించారు.