News October 19, 2025
కృష్ణ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడులు.. UPDATE

NRPT జిల్లా రాష్ట్ర సరిహద్దులోని కృష్ణ ఆర్టీవో చెక్‌పోస్ట్‌పై ACB అధికారులు మధ్య రాత్రి దాడులు చేశారు. అధికారులు తనిఖీల సమయంలో కార్యాలయంలో విద్యుత్ లైట్లను ఆఫ్ చేసి, టార్చ్‌లైట్ల సహాయంతో సోదాలు జరిపారని సమాచారం. ఆ సమయంలో మోటార్ వెహికల్ అధికారి ప్రవీణ్ విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సోదాల్లో లెక్క చూపని నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అవినీతి ఫిర్యాదుల నేపథ్యంలో దాడులు చేసినట్లు తెలుస్తోంది.
Similar News
News October 21, 2025
రాజ్ ఇంట్లో సమంత దీపావళి సెలబ్రేషన్స్

బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి హీరోయిన్ సమంత దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు. పండగ సందర్భంగా సామ్ ఆయన ఇంటికి వెళ్లారు. రాజ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి బాణసంచా కాల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘నా మనసు కృతజ్ఞతతో నిండిపోయింది’ అని క్యాప్షన్ ఇచ్చారు. కాగా వీరు లవ్‌లో ఉన్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
News October 21, 2025
మీ నిస్వార్థ సేవకు సలామ్!❤️

దీపావళికి లక్ష్మీ పూజకు ఏర్పాట్లు చేస్తోన్న ఓ మహిళా డాక్టర్‌కు ‘ఎమర్జెన్సీ’ అని ఫోన్ వచ్చింది. మిగతా డాక్టర్లు సెలవులో ఉండటంతో ఆమె పూజను వదిలి తన బాధ్యతకు ప్రాధాన్యతనిచ్చారు. పిండంలో కదలికలు లేకపోవడంతో ఆందోళనలో ఉన్న ఓ గర్భిణికి ఆపరేషన్ చేసి బిడ్డను కాపాడారు. తన ఇంట్లో లక్ష్మిని వదిలి వచ్చినా.. మరో ఇంటి లక్ష్మీదేవికి ప్రాణం పోశానంటూ ఆమె ట్వీట్ చేశారు. నిస్వార్థంగా సేవచేసే వైద్యులకు సలామ్!
News October 21, 2025
కవిటి: ఆ గ్రామం ఆదర్శం..!

కవిటి (M) పొందూరు పుట్టుగ గ్రామం దీపావళి పండగకు దూరంగా ఉంది. కారణం ఏమిటంటే..? ఈ నెల 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు దూగాన రామ్మూర్తి (44), ప్రణయ్ (17) తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీపావళి నాడు బాధిత కుటుంబంలో అమావాస్య చీకట్లు అల్లుకున్నాయని గ్రామస్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు.