News March 16, 2025
కృష్ణ: నేడు మంత్రి రాక.. భారీ బందోబస్తు సిద్ధం

మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ముడుమాల్ గ్రామంలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాతి పొందిన నిలువురాళ్ళను సందర్శించడానికి ఆదివారం కృష్ణ మండలం ముడుమాల్ గ్రామానికి రానున్నట్లు మక్తల్ సీఐ రామ్ లాల్ తెలిపారు. శనివారం కృష్ణ మండలం పరిధిలోని ముడుమల్ నిలువురాళ్లు సీఐ సందర్శించి మంత్రి రాకకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News March 16, 2025
ఏలూరు జిల్లాలో దారుణం

బాలుడిని చైన్లతో కట్టేసి బంధించిన ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. బాధితుడి తండ్రి వివరాల మేరకు.. నిడమర్రు మండలం ఉప్పరగూడేనికి చెందిన బాలుడు 10వ తరగతి చదువుతున్నాడు. కొల్లేరులో గొర్రెలు కాస్తున్న తండ్రి వద్దకు బయల్దేరాడు. మార్గమధ్యలో జిరాయితీ భూముల్లో బాలుడు చేపలు పట్టాడంటూ వెంకన్న, పండు అనే వ్యక్తులు బాలుడిని గ్రామంలోకి తీసుకెళ్లి కుక్కల గొలుసుతో కట్టేశారు. తర్వాత మందలించి బాలుడిని వదిలేశారు.
News March 16, 2025
చిత్తూరులో చికెన్ ధరల వివరాలు

చిత్తూరు జిల్లాలోని పలు దుకాణాలలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. బాయిలర్ కోడి కిలో రూ.114, లేయర్ కోడి రూ.90గా పలు దుకాణాలలో విక్రయిస్తున్నారు. కాగా బాయిలర్ కోడి మాంసం కేజీ. రూ.165, స్కిన్ లెస్ కేజీ రూ.185, లేయర్ కోడి మాంసం కేజీ రూ.153 పలుకుతోంది. మీ ప్రాంతాలలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News March 16, 2025
ఒక్క హిట్ కోసం ఈ హీరోల ఎదురుచూపులు!

టాలీవుడ్‌లో ఇటు చిన్న కథలు, అటు భారీ సినిమాలు చక్కటి విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్నాయి. కానీ మిడ్‌రేంజ్ హీరోలు మాత్రం ఆ మధ్యలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. విజయ్ దేవరకొండ, గోపీచంద్, నితిన్, వరుణ్ తేజ్, అక్కినేని అఖిల్.. వీళ్లంతా హిట్ చూసి చాలాకాలమే అయింది. అటు మరీ చిన్న సినిమాలు చేయలేక, ఇటు భారీ బడ్జెట్ ఎంచుకోలేక సతమతమవుతున్నారు. ఎలాగైనా హిట్ కొట్టి ట్రాక్ ఎక్కాలని ఎదురుచూస్తున్నారు.