News March 23, 2025
కృష్ణ భారతి కాళ్లకు నమస్కరించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పట్టణంలోని అల్లూరి కాంస్య విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన సందర్భంలో పసల కృష్ణమూర్తి కుమార్తె పసల కృష్ణ భారతి కాళ్లకు నమస్కరించారు. ఆ సందర్భంలో కృష్ణ భారతి మోదీ తల్లి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అప్పుడే పసల కృష్ణ భారతి సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. పెంటపాడు మండలం పడమర విప్పర్రు గ్రామానికి చెందిన కృష్ణభారతి ఆదివారం మృతి చెందడంతో పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Similar News
News March 25, 2025
‘గూడెం’ బార్ అసోసియేషన్ ఎన్నికల నగారా

తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్‌లో ఎన్నికల నగారా మోగింది. 2025 – 26వ సంవత్సరానికి సంబంధించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు ఈ నెల 25, 26వ తేదీల్లో నామినేషన్ స్వీకరించనున్నారు. సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ స్వీకరించనున్నట్లు ఎన్నికల అధికారి ప్రవీణ్ ప్రకాశ్ మంగళవారం తెలిపారు. 26న సాయంత్రం స్క్రూట్నీ, 27న ఉపసంహరణ, 29న ఎన్నికలు జరుగుతాయన్నారు.
News March 25, 2025
ప.గో: ప్రాణాలు తీస్తున్న ఈత సరదా..!

గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు ఈత ఒక సరదా..! కానీ అదే ఈత పసిప్రాణాలను హరించేస్తోంది. ఏటా ఏదో ఒకచోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీని పర్యవసానంగా పలు కుటుంబాల్లో విషాదం అలముకుంటోంది. వేసవిలో ఒక పూట బడులు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు సరదాకు కాలువ గట్లు, చెరువులు, కుంటల్లో ఈతకు వెళ్తున్నారు. అవి ఎక్కువ లోతు ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రుల తమ పిల్లలపై ఒక కన్ను వేసి ఉంచాలి.
News March 25, 2025
పెంటపాడు: హత్య కేసులో వ్యక్తికి ఏడేళ్ల జైలు.. జరిమానా

పెంటపాడు (M) ఆకుతీగపాడు గ్రామంలో ఆస్తి తగాదాలను కారణంగా చిన్నం శ్రీనివాస్ తన సోదరుడు వెంకటేశ్వర్లును హత్య చేశాడని స్థానిక ఎస్ఐ స్వామి తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా చిన్నం శ్రీనివాస్‌ను తాడేపల్లిగూడెం 11వ ఏడీజే కోర్టులో సోమవారం హాజరపరిచగా, నేరం నిరూపణ కావడంతో ఏడేళ్ల జైలు, రూ.5వేలు జరిమానా విధిస్తూ మేజిస్ట్రేట్ షేక్ సికిందర్ తీర్పు వెలువరించారు. పీపీ శివరామకృష్ణ సహకరించారన్నారు.