News September 20, 2025
కృష్ణ మిల్క్ యూనియన్‌కు Trusted Dairy Brand అవార్డ్

టైమ్స్ ఆఫ్ ఇండియా 7వ ఎడిషన్‌లో జరిగిన టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణా మిల్క్ యూనియన్ “Trusted Dairy Brand” అవార్డును అందుకుంది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వరబాబు స్వీకరించారు. ఈ అవార్డు రావడం పట్ల సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News September 21, 2025
వనదేవతల గద్దెలు యథాతథం. ప్రాంగణం మాత్రమే విస్తరణ..!

మేడారం వన దేవతల గద్దెల మార్పుపై ఉత్కంఠ వీడింది. వరుస క్రమంలో గద్దెలను మార్చి భక్తులకు దర్శనాన్ని సులభతరం చేయాలనే పూజారుల సూచన మేరకు యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. అయితే, ఆదివాసీ సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో చర్చ మొదలైంది. శనివారం హైదరాబాద్‌లో మంత్రులు, అధికారులతో సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి సంప్రదాయాలను పాటిస్తూ గద్దెలను యథాతథంగా ఉంచాలని, ప్రాంగణం విస్తరణకు ప్రణాళిక చేయాలని సూచించారు.
News September 21, 2025
మేడారంలో హరితం.. వెలుగులీననున్న సంప్రదాయం!

కోటిన్నర మంది భక్తుల రాకతో రెండేళ్లకోసారి జనారణ్యంగా మారే మేడారంలో ఆదివాసీలు దైవంలా కొలిచే సంప్రదాయ వృక్షాలు అంతరించిపోతున్నాయి. ఒకప్పుడు వనదేవతల గద్దెలపై ఉండే రావి, జువ్వి, బండారి వంటి జాతుల వృక్షాలు కనుమరుగయ్యాయి. ఈ పరిణామం భక్తుల విశ్వాసాలకు ఇబ్బందిగా మారింది. అయితే.. మేడారం పరిసరాల్లో ఆదివాసీల సంప్రదాయ వృక్షాలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడం శుభపరిణామం. అలాగే ఇప్ప, వెదురు వనాలను సంరక్షించాలి.
News September 21, 2025
వేయి స్తంభాల గుడిలో వేడుకలు.. హాజరుకానున్న మంత్రులు

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలు రేపు వేయిస్తంభాల గుడిలో ప్రారంభం కానున్నాయి. ప్రారంభ వేడుకలకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క హాజరు కానున్నారు. రాష్ట్ర మహిళలకు మంత్రి కొండా సురేఖ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి సురేఖ తెలిపారు.