News September 14, 2025
కృష్ణ- వికారాబాద్ రైల్వే లైన్ పనులకు కొత్త ప్రతిపాదనలు

వికారాబాద్- కృష్ణా రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి రైల్వే శాఖ అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సీఎంతో జరిగిన సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం సూచించిన కొత్త రైల్వే ప్రాజెక్టు ఎలైన్‌మెంట్‌తో DPR రైల్వే బోర్డుకు సమర్పించనున్నారు.
Similar News
News September 14, 2025
ఆ అమ్మవారికి పెరుగన్నమే ప్రీతి

నిర్మల్ జిల్లాలోని అడెల్లి పోచమ్మకు పెరుగన్నమంటే చాలా ప్రీతి. ఒకప్పుడు తీవ్రమైన కరవుతో అల్లాడిన ప్రజలను రక్షించడానికి శివుడు తన కుమార్తె పోచమ్మను ఇక్కడికి పంపాడని నమ్ముతారు. ఆమె కృప వల్లే ఇక్కడ వర్షాలు కురిసి, కరవు పోయిందని అంటారు. అందుకే అమ్మవారికి కోనేటి నీటితో వండిన అన్నంలో పెరుగు కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆలయం వద్దే వంటలు చేసుకొని పంక్తి భోజనాలు చేస్తారు.
News September 14, 2025
ములుగు : సీఎం రేవంత్‌కు మేడారం సెంటిమెంట్

మేడారం అంటే సీఎం రేవంత్ రెడ్డికి సెంటిమెంట్. ఆయన రాష్ట్రంలో చేసిన హాత్ సే హాత్ జోడో యాత్రను మేడారం సమ్మక్క-సారలమ్మ సన్నిధానం నుంచి Feb 6, 2023లో ప్రారంభించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఈ యాత్ర దోహదపడింది. ప్రభుత్వం ఏర్పడ్డ తొలిసారి 2024లో జరిగిన జాతరకు రూ.105కోట్లు ఇచ్చిన సీఎం ఈసారి రూ 236.2కోట్లతో మాస్టర్ ప్లాన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏర్పాట్ల పరిశీలనకు స్వయంగా రానున్నారు.
News September 14, 2025
HYD: ట్రాఫిక్ సమస్యలు.. మెట్రో ఎక్కిన బీజేపీ చీఫ్

దశాబ్ద కాలం అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ HYDలో రోడ్లు, డ్రైనేజీ, ప్రజా రవాణా వ్యవస్థలను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు విమర్శించారు. ఇటీవల కురిసిన వర్షాలకు నగరంలో భారీగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో తాను మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోలో ప్రయాణించాల్సి వచ్చిందని తెలిపారు.