News September 12, 2025
కృష్ణ-VKB రైల్వేలైన్ పనులు చేపట్టాలి- CM

కృష్ణ- వికారాబాద్ రైల్వే లైన్ పనులను త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులపై దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొత్తగా నిర్మించే వికారాబాద్ – కృష్ణ రైల్వే ప్రాజెక్ట్ ద్వారా కొడంగల్, నారాయణపేట, మక్తల్, పరిగి ప్రాంతాల ప్రజలకు మేలు జరగనుంది.
Similar News
News September 12, 2025
మావోయిస్టు మృతితో మడికొండలో విషాద ఛాయలు..!

హనుమకొండ జిల్లా మడికొండలో మావోయిస్టు మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి. మడికొండ వాస్తవ్యుడైన కేంద్ర కమిటీ సభ్యుడు (CCM), సెంట్రల్ రీజినల్ బ్యూరో మెంబర్ (CRBM), ఒడిషా రాష్ట్ర కమిటీ కార్యదర్శి మోడెం బాలకృష్ణ(60) అలియాస్ బాలన్న అలియాస్ భాస్కర్ అలియాస్ మనోజ్ అలియాస్ రాజేష్ అలియాస్ రామచందర్ అలియాస్ రాజేంద్ర మరణించినట్టుగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రఖేచా వెల్లడించారు.
News September 12, 2025
KMR: యువకుడి మోసం.. యువతి ఆత్మహత్య

ప్రేమలో మోసపోయానని మనస్తాపంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఎల్లారెడ్డి మండలం సబ్దల్ పూర్‌లో బుధవారం జరిగింది. ఎస్సై బొజ్జ మహేష్ వివరాలు.. గ్రామానికి చెందిన సావిత్రి(19) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. శెట్టిపల్లి సంగారెడ్డికి చెందిన ప్రదీప్ ప్రేమ పేరుతో మోసం చేశాడని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News September 12, 2025
పల్నాడులో 14 నెలల విధులు నిర్వహించిన అరుణ్ బాబు

పల్నాడు జిల్లా కలెక్టర్‌గా 14 నెలల పాటు పనిచేసిన పి. అరుణ్ బాబు బదిలీ అయ్యారు. ఆయన 2024 జులై 7న జిల్లా మెజిస్ట్రేట్‌గా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన పల్నాడు జిల్లాకు వచ్చారు. జిల్లా ఏర్పడిన తర్వాత తొలి కలెక్టర్‌గా లోతేటి శివశంకర్ పనిచేశారు.