News August 17, 2025

కృష్ణ: Way2News ఎఫెక్ట్.. స్పందించిన మంత్రి

image

కృష్ణ మండలం గుడెబల్లూర్‌లో శ్మశానానికి వెళ్లే దారిలేక గ్రామస్థులు మృతదేహాలను మోకాలి లోతు నీటిలో మోసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఆగస్టు 4న Way2Newsలో ‘మంత్రి ఇలాకాలో <<17296536>>శ్మశానానికి<<>> దారేది?’ అనే కథనం ప్రచురితమైంది. దీనిపై తక్షణమే శ్మశానానికి రోడ్డు వేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ప్లొకెయిన్‌తో పనులు మొదలుపెట్టారు. దీంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.

Similar News

News August 17, 2025

నాగావళి నదిలో స్నానానికి దిగి మృతి

image

పార్వతీపురం మన్యం జిల్లాలో ఆదివారం ఉదయం విషాదం నెలకొంది. పాలకొండ మండలం అన్నవరంలో బంధువుల ఇంటికి వచ్చిన పవన్ (16) నాగావళి నదిలో స్నానానికి దిగి మృతి చెందాడు. మృతి చెందిన పవన్ ఆమదాలవలస మండలం వజ్రగూడ గ్రామానికి చెందినవాడు. సెలవులకు బంధువుల ఇంటికి వచ్చి మృతి చెందడంతో ఇటు అన్నవరంలోనూ అటు వజ్రగూడ గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి.

News August 17, 2025

NZB: 638 సంఘాలు.. రూ 72.22 కోట్ల రుణాలు

image

నిజామాబాద్ జిల్లాలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ద్వారా స్వయం సహాయక సంఘాలకు భారీగా రుణాలు మంజూరయ్యాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 638 సంఘాలకు బ్యాంకు లింకేజి ద్వారా రూ. 72.22 కోట్లు వడ్డీలేని రుణాలు ఇప్పించినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో 9,094 స్వయం సహాయక సంఘాల్లో 90,940 మంది సభ్యులున్నారు. పీఎం స్వనిధి కింద 4 మున్సిపాలిటీలలో వీధి వ్యాపారులకు రూ.10 వేల చొప్పున రుణాలు అందజేశారు.

News August 17, 2025

ASF: పెండింగ్ కేసులు త్వరగా పూర్తిచేయాలి: ఎస్పీ

image

పెండింగులో ఉన్న కేసులు త్వరగా పూర్తి చేయాలని, మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సూచించారు. శనివారం కాగజ్ నగర్ పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండాలని, పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని, మత్తుపదార్థాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.