News September 21, 2025
కెనడాలో బతుకమ్మ ఉత్సవాలకు చీఫ్ గెస్ట్‌గా వరంగల్ వాసి

వరంగల్ వాసికి అరుదైన గౌరవం దక్కింది. కెనడాలో నిర్వహించే బతుకమ్మ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా పర్వతగిరి మండలం చౌటపల్లికి చెందిన బతుకమ్మ తల్లి చరిత్ర పరిశోధకుడు వంగాల శాంతి కృష్ణకు ఆహ్వానం అందింది. ఈనెల 27న కెనడాలో తెలుగు అలయన్సెస్ ఆఫ్ కెనడా(తాకా) ఆధ్వర్యంలో నిర్వహించే ఉత్సవాలకు ఇండియా నుంచి కేవలం శాంతి కృష్ణకు మాత్రమే ఆహ్వానం అందడం విశేషం.
Similar News
News September 21, 2025
పర్వతగిరి: బతుకమ్మ తల్లి చరిత్ర పరిశోధకుడు.. వంగాల శాంతి కృష్ణుడు

పర్వతగిరి మండలం చౌటపల్లికి చెందిన వంగాల శాంతి కృష్ణుడు బతుకమ్మ తల్లి చరిత్ర గురించి పలు పరిశోధనలు చేశారు. బతుకమ్మ తల్లి జన్మస్థానం చౌటపల్లి గ్రామం అని తన పరిశోధనల ద్వారా ఆనవాళ్లను గుర్తించారు. దానికి శాస్త్రీయ ఆధారాలను వెతికే పనిలో ఉన్నారు. చరిత్ర పరిశోధనలో భాగంగా పలుచోట్ల నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరై బతుకమ్మ తల్లి విశేషాలను నేటి తరానికి వివరిస్తున్నారు.
News September 21, 2025
వరంగల్: నాటి పురాణ గాథలే నేటి బతుకమ్మ పాటలు

బతుకమ్మపాటల్లో రామాయణ, భారత పురాణ కథల ఆధారంగా అల్లిన జానపదాలున్నాయి. రేణుక ఎల్లమ్మ కథ ఆధారంగా అల్లుకున్న పాటలున్నాయి. బతుకమ్మ పాటల్లోని రాజ రంపాలుడి కథ మహాభారతం ఆధారంగా అల్లింది. ఎములాడ రాజన్న, యాదగిరి నరసన్న, శ్రీశైలం మల్లన్న కరుణా కటాక్షాలు చూపమని రామ రామ ఉయ్యాలో’ పాటల కోరుకుంటారు.
చల్లకుండ కాడ ఉయ్యాలో.. దాగి ఉన్నవు నాగ ఉయ్యాలో, చల్లల్లపురుగాని ఉయ్యాలో చంపేరు నిన్ను ఉయ్యాలో అంటూ ఆడి పాడుతారు.
News September 20, 2025
వరంగల్ జిల్లాకు వర్ష సూచన..!

వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఏ సమయంలోనైనా తుపాన్ ముప్పు, ఏ క్షణమైనా అతి తీవ్ర వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. భారీ వరదలు, తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుందని, ఈనెల 27 వరకు ఏ రోజైనా, ఎక్కడైనా అతి తీవ్ర వర్షం కురిసే అవకాశాలు కల్పిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.