News October 28, 2025

కెరమెరిలో పాము కాటుతో మహిళ మృతి

image

కెరమెరి మండలం సావర్ ఖేడ గ్రామానికి చెందిన మొహర్లే సంధ్య (31) పాముకాటుతో మృతి చెందింది. సోమవారం సాయంత్రం తన పత్తి పొలంలో పత్తి తీసే క్రమంలో సాయంత్రం పాముకాటు వేసింది. స్థానిక కుటుంబ సభ్యులు గమనించి ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్థరాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Similar News

News October 28, 2025

బీట్‌రూట్‌తో చిన్నారులకు మేలు

image

పిల్లలు పెరిగే కొద్దీ వారికి అందించే పోషకాలు కూడా పెరగాలి. దానికి బీట్‌రూట్ మంచి ఆప్షన్ అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇందులో ఫైబర్‌, ఫోలేట్‌, మాంగనీస్‌, పొటాషియంతో పాటు విటమిన్‌ బి9 ఉండటం వల్ల ఎర్రరక్త కణాల తయారీకి, రక్త ప్రసరణకు తోడ్పడతాయి. పిల్లల్లో మెదడు, జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంతో పాటు రోగనిరోధకశక్తిని పెంచుతుంది. కాబట్టి పిల్లల ఆహారంలో దీన్ని చేర్చాలని చెబుతున్నారు.

News October 28, 2025

ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్

image

మొంథా తీవ్ర తుఫాన్ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ, ఒడిశాకు వాతావరణ శాఖ ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలోని గుంటూరు, కృష్ణా, ప.గో, తూ.గో, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరంతో పాటు టీజీలోని భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో రేపు ఉదయం లోపు ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఒడిశాలోని గజపతి, గంజాం జిల్లాలకూ అలర్ట్ ఇచ్చింది. ఇక ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా కుండపోత వానలు పడుతున్నాయి.

News October 28, 2025

భారీ వర్షాలు.. భావన కీలక ఆదేశాలు

image

తుఫాన్ నేపథ్యంలో రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్.ఎస్.భావన ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవాలని సూచించారు. వర్షాలు కురుస్తున్న సమయంలో పిల్లలు, మహిళలు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు 8977942101 నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.