News December 21, 2025

కెరమెరి: గుండెపోటుతో బట్టల వ్యాపారి మృతి

image

బస్సు కోసం ఎదురుచూస్తున్న వ్యక్తికి గుండెపోటు రావడంతో కూర్చున్న చోటే మృతి చెందిన ఘటన కెరమెరిలో చోటుచేసుకుంది. ASFకు చెందిన అహ్మద్ నవాబ్ బట్టల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం కెరమెరి వారసంతకు బట్టలు అమ్మడానికి వచ్చాడు. వ్యాపారం ముగించుకొని కెరమెరి బస్టాండ్‌లో బస్సు కోసం ఎదురుచూస్తుండగా కూర్చున్నచోటే గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

Similar News

News December 24, 2025

డిసెంబర్ 24: చరిత్రలో ఈ రోజు

image

✒ 1924: లెజెండరీ సింగర్ మహ్మద్ రఫీ జననం(ఫొటోలో)
✒ 1956: నటుడు, నిర్మాత అనిల్ కపూర్ జననం
✒ 1987: తమిళనాడు మాజీ సీఎం, నటుడు ఎంజీ రామచంద్రన్ మరణం
✒ 2002: ఢిల్లీ మెట్రో రైల్వేను ప్రారంభించిన ప్రధాని వాజ్‌పేయి
✒ 2005: ప్రముఖ నటి భానుమతి మరణం
✒ జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం

News December 24, 2025

సీఎం చంద్రబాబును కలిసిన పూల నాగరాజు

image

అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమితులైన పూల నాగరాజు మంగళవారం సెక్రటేరియట్‌లో సీఎం నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని నాగరాజు పేర్కొన్నారు. ఆయనతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి కూడా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

News December 24, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.