News December 19, 2025
కెరమెరి: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

కెరమెరి మండలం అంబారావుగూడ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ధనోర నుంచి ఆసిఫాబాద్ వైపు బైక్ పై వెళ్తుండగా ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను అతివేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఒకరు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 19, 2025
విజయవాడ కృష్ణానదిలో హౌస్ బోట్లు!

AP: పర్యాటక రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. కేరళ స్టైల్ లగ్జరీ హౌస్ బోట్లను విజయవాడ కృష్ణానదిలో తిప్పాలని యోచిస్తోంది. వీటిలో ఏసీ, లగ్జరీ బెడ్ రూమ్, అటాచ్డ్ బాత్ రూమ్, డైనింగ్ స్పేస్ ఉంటాయి. పర్యాటకుల సేఫ్టీ కోసం లైఫ్ జాకెట్లతో పాటు ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. తొలి విడతలో 20 హౌస్ బోట్లు తీసుకువచ్చే అవకాశం ఉంది. రాత్రంతా ఉండేందుకు స్పెషల్ ప్యాకేజీలు ఉండనున్నాయి.
News December 19, 2025
నరసరావుపేట: బైక్ దొంగ అరెస్ట్.. 8 వాహనాలు స్వాధీనం

ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న షేక్ ఇస్మాయిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. CI ప్రభాకర్ తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు మిర్చి యార్డులో కూలీగా పనిచేసే ఇస్మాయిల్, వ్యసనాలకు బానిసై దొంగతనాలు మొదలుపెట్టాడు. నిందితుడి నుంచి నరసరావుపేట, చిలకలూరిపేట, నగరంపాలెం, మేదరమెట్ల ప్రాంతాల్లో చోరీ చేసిన 8వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు CI పేర్కొన్నారు.
News December 19, 2025
చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్తారు: ఎస్వీ

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ప్రజలకు ఒక్క హామీ కూడా అమలు కాలేదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. చంద్రబాబు చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు. లేకపోతే ప్రజలు మరొకసారి గుణపాఠం చెప్తారని అన్నారు. పేదల హక్కుల కోసం చివరి వరకు జగన్ పోరాడుతారని అన్నారు.


