News March 4, 2025
కెరమెరి: హెచ్ఎంపై దాడి.. వ్యక్తిపై కేసు

కెరమెరి మండలం హట్టి హై స్కూల్ హెచ్ఎం గన్నుపై సోమవారం ఓ వ్యక్తి దాడి చేసి గాయపరిచినట్లు SI విజయ్ తెలిపారు. మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బస్సు కోసం ఎదురుచూస్తున్న హెచ్ఎంను మద్యం మత్తులో ఉన్న దినేశ్ ఆసుపత్రి అడ్రస్ అడిగాడు. ఆయన చెప్పకపోవడంతో దినేశ్ తన జేబులో ఉన్న బ్లేడుతో ఆయన గొంతుపై దాడి చేశాడు. హెచ్ఎం ఫిర్యాదు మేరకు దినేశ్ పై కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు.
Similar News
News March 4, 2025
పెద్దపల్లి: LRS ఫీజులపై 25% మినహాయింపు: కమిషనర్

పెద్దపల్లి పట్టణ ప్రజలు లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (LRS) పరిధిలో ఫీజులు మార్చి 31లోపు చెల్లిస్తే 25% మినహాయింపు పొందవచ్చని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ తెలిపారు. ప్రభుత్వం అందించిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ ఆస్తులను రెగ్యులరైజ్ చేసుకోవాలని సూచించారు. నిర్ణీత గడువులోపు ఫీజులు చెల్లించి ప్రయోజనం పొందాలని కమిషనర్ కోరారు.
News March 4, 2025
కృష్ణా: వాలంటీర్ అభ్యర్థికి వచ్చిన ఓట్ల సంఖ్య ఇదే..!

గుంటూరు- కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయవాడకు చెందిన వాలంటీర్ గంటా మమత ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఓట్ల లెక్కింపులో ఆమెకు మొత్తంగా 718 ఓట్లు వచ్చాయి. చట్ట సభల్లో ప్రజలు, వాలంటీర్ల సమస్యలను వినిపించాలనే ఉద్దేశంతో తాను బరిలోకి దిగినట్లు తెలిపారు. ఇకపైనా వాలంటీర్ల సమస్యలపై పోరాటం చేస్తానని చెప్పారు. తనకు ఓట్లు వేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
News March 4, 2025
రోహిత్ అలా ఆడితే భారీ స్కోరు ఖాయం: మంజ్రేకర్

నేడు AUSతో జరిగే సెమీస్ మ్యాచ్‌లో రోహిత్ ఎలా ఆడతారన్నదే కీలకమని వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ‘గిల్, విరాట్, అయ్యర్ వారిదైన శైలిలో ఆడుకుంటూ వెళ్లిపోతారు. కానీ రోహిత్ మాత్రం వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండేందుకు చూడాలి. ప్రత్యర్థి స్పిన్నర్లు వచ్చే సమయానికి ఆయన కుదురుకుంటే భారీ స్కోరు సాధ్యపడుతుంది. ఇది 350 పిచ్ కాదు. దానికి తగ్గట్టుగా తుది స్కోరును ప్లాన్ చేసుకోవాలి’ అని సూచించారు.