News December 21, 2025

‘కెరీర్ మినిమలిజం’.. Gen Zలో కొత్త ట్రెండ్.. ఏంటిది?

image

ఆఫీసుల్లో రాత్రి పగలు కష్టపడే హజిల్ కల్చర్‌కు Gen Z చెక్ పెడుతోంది. దీన్నే కెరీర్ మినిమలిజం అంటున్నారు. అంటే పని పట్ల బాధ్యత లేకపోవడం కాదు. ప్రమోషన్లు, హోదాల వెంట పడకుండా ప్రశాంతతకు ప్రాధాన్యం ఇవ్వడం. మేనేజర్ పోస్టుల్లో ఉండే స్ట్రెస్ కంటే మెంటల్ హెల్త్, పర్సనల్ లైఫ్ ముఖ్యమని వీరు భావిస్తున్నారు. 72% మంది టీమ్ మేనేజ్‌మెంట్ కంటే స్కిల్స్ పెంచుకోవడానికే ఇష్టపడుతున్నారు.

Similar News

News December 24, 2025

లైఫ్ అంటే పని మాత్రమే కాదు బాస్! ఈ దేశాలను చూడండి..

image

వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విషయంలో కొన్ని దేశాలు మెరుగ్గా ఉన్నాయి. నెదర్లాండ్స్‌లో ఫ్లెక్సిబుల్ వర్క్ కల్చర్‌తో ఫ్యామిలీకి టైమ్ దొరుకుతుంది. డెన్మార్క్ తక్కువ పని గంటలు, ఎక్కువ సెలవులతో టాప్‌లో ఉంది. ఉద్యోగుల సంక్షేమం విషయంలో స్వీడన్, సండే రెస్ట్‌ ఇంపార్టెన్స్‌లో జర్మనీ, పనిదోపిడీని అరికట్టడంలో న్యూజిలాండ్ ముందు వరుసలో ఉన్నాయి. అందుకే ఆ దేశాల్లో ప్రొడక్టివిటీతో పాటు పర్సనల్ లైఫ్ మెరుగ్గా ఉంటుంది.

News December 24, 2025

BSNL ఆఫర్.. రూ.251కే 100GB

image

న్యూ ఇయర్ సందర్భంగా BSNL వరుస <<18637920>>ఆఫర్లతో<<>> హోరెత్తిస్తోంది. తాజాగా 30 రోజుల వ్యాలిడిటీతో రూ.251 ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీంతో 100 GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌తోపాటు ఫ్రీగా BiTV(BSNL ఎంటర్‌టైన్‌మెంట్)ను వీక్షించవచ్చని తెలిపింది. ఈ ఆఫర్ JAN 31 వరకు ఉంటుందని పేర్కొంది. అయితే ఎన్ని ఆఫర్లు ఇచ్చినా నెట్‌వర్క్ ఉండట్లేదని కస్టమర్లు పేర్కొంటున్నారు. 4G, 5G నెట్‌వర్క్ బలోపేతంపై దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు.

News December 24, 2025

సోయాబీన్, మొక్కజొన్న రైతులను కేంద్రం ఆదుకోవాలి

image

TG: వర్షాలతో నష్టపోయిన సోయాబీన్ రైతులను ఆదుకోవాలని కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. సోయా కోతదశలో వర్షాల వల్ల ADB, NRML, KMRD, SRD జిల్లాల్లో 36వేల టన్నుల పంట దెబ్బతిందని దీన్ని ధర మద్దతు పథకం(PSS) కింద కొనుగోలుకు అనుమతివ్వాలని కోరారు. మొక్కజొన్నను నాఫెడ్ ద్వారా కొనుగోలు చేసి ఇథనాల్, డిస్టిలరీ పరిశ్రమలకు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.