News September 3, 2025
కేంద్రం నిర్లక్ష్యంతోనే యూరియా కష్టాలు: తుమ్మల

కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే యూరియా కష్టాలు వచ్చాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశవ్యాప్తంగా యూరియా కొరత ఉందని, ఆ ప్రభావం తెలంగాణ పైనా పడిందని చెప్పారు. గత నెల తెలంగాణకు రావాల్సిన యూరియా పూర్తిగా రాలేదని, యూరియా పంపాలని పదే పదే కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. యూరియా విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదని విమర్శించారు.
Similar News
News September 3, 2025
మున్నేరు నిమజ్జన ఘాట్‌ను పరిశీలించిన సీపీ

గణేశ్ నిమజ్జన వేడుకల నేపథ్యంలో నగరంలోని కాల్వోడ్డు, మున్నేరు వద్ద ఉన్న నిమజ్జన ఘాట్‌ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పరిశీలించారు. నగరపాలక కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ శ్రీజ, మేయర్ నీరజ, సంభాద్రి ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనతో కలిసి ఈ పరిశీలనలో పాల్గొన్నారు. శోభాయాత్ర, నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు.
News September 3, 2025
అత్యధికంగా తల్లాడ.. అత్యల్పంగా కొణిజర్ల

ఖమ్మం జిల్లాలో బుధవారం ఉదయం 8:30 వరకు గడచిన 24 గంటల్లో 82.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. తల్లాడ 10.2, చింతకాని 9.0, బోనకల్ 8.0, KMM(R) 6.8, KSMC 6.4, SPL 6.2, వేంసూరు 5.6, KMM(U), కల్లూరు 4.8, T.PLM 4.4, NKP 3.4, ఏన్కూరు 2.8, R.PLM 2.0, KMPL, PNBL 1.8, MDR 1.4, సింగరేణి, ఎర్రుపాలెం 0.8, MDGD 0.6, కొణిజర్ల 0.4 నమోదైంది.
News September 3, 2025
ఖమ్మం: చేపపిల్లల టెండర్ల దాఖలు గడువు పొడిగింపు

ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది 882 జలాశయాల్లో 3.49కోట్ల చేపపిల్లలు ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి టెండర్ల దరఖాస్తు కోసం ఆహ్వానించిన విషయం తెలిసింది. అయితే జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటి నాటికి మూడు టెండర్లు నమోదైనట్లు సమాచారం. దీంతో గడువును ఈనెల 8వ తేదీ వరకు పెంచారు. ఆపై టెండర్లను ఖరారు చేశాక చేప పిల్లల పంపిణీ చేయనున్నారు.