News October 3, 2025

కేంద్రమంత్రికి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి

image

ప్రజలకు మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చడం, పౌర సౌకర్యాలను మెరుగుపరచడంలో రక్షణ శాఖ భూములు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. దీనిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్ యూజర్ ఛార్జీలు పెండింగ్‌లో ఉన్నాయని, ఆ బకాయిలను క్లియర్ చేయాలని కోరారు. ఈ విజ్ఞప్తులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని రక్షణ శాఖ సానుకూలంగా స్పందించిందని మంత్రి చెప్పారు.

Similar News

News October 3, 2025

బాబా జయంతోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

పుట్టపర్తిలో నిర్వహించనున్న సత్యసాయిబాబా జయంతోత్సవాల ఏర్పాట్లను కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ట్రస్ట్ సభ్యులతో కలిసి పరిశీలించారు. ప్రశాంతి నిలయం, వెస్ట్ గెట్, స్టేడియం, హారతి ఘాట్, విమానాశ్రయం, రైల్వే స్టేషన్, బస్టాండ్ సందర్శించారు. పర్యాటకుల సౌకర్యార్థం పార్కింగ్, షెల్టర్లు, విద్యుత్, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించనున్నట్లు వివరించారు.

News October 3, 2025

శ్రీకాకుళం: ‘నూతన డీఎస్సీ ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం’

image

జిల్లాలో నూతనంగా ఎంపికైన 534 మంది డీఎస్సీ ఉపాధ్యాయులకు శుక్రవారం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. శిక్షణకు వెళ్లే ముందు ఎంపికైన ఉపాధ్యాయులు జాతీయ జెండాతో పాటు శాంతిని కలిగించే జెండాలను పట్టుకుని వెల్కమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఈవో రవిబాబు స్వాగత ఉపన్యాసంతో ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలన్నారు. DyDEO విజయ్ కుమార్, పలువురు ఎంఈఓలు పాల్గొన్నారు.

News October 3, 2025

WGL: ఆ రెండు జిల్లాల్లో సీతక్క మద్దతే కీలకం..!

image

ఉమ్మడి వరంగల్ పరిధిలోని రెండు జిల్లాల్లో మంత్రి సీతక్క నిర్ణయమే కీలకం కానుంది. సొంత జిల్లా అయిన ములుగు జడ్పీ పీఠం ఎవరిదో నిర్ణయించేది సీతక్కనే. ములుగుతోపాటు మహబూబాబాద్ జిల్లా జడ్పీ పీఠంను కూడా డిసైడ్ చేయబోయేది కూడా సీతక్కనే. ఎలా అని అనుకుంటున్నారా..?ములుగు నియోజకవర్గంలోని గంగారం మండలం కూడా సీతక్క నియోజకవర్గంలోనిదే. గంగారం ZPTCజనరల్ కావడంతో సీతక్క చెప్పిన వారికే జడ్పీ పీఠం కూడా దక్కే అవకాశం ఉంది.