News June 18, 2024

కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరసాపురం MP

image

నరసాపురం MP భూపతిరాజు శ్రీనివాస వర్మకు ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ కేంద్ర సహాయ మంత్రిగా అవకాశం దక్కిన విషయం తెలిసిందే. కాగా ఆయన నేడు ఢిల్లీలో మంత్రి బాధ్యతలు స్వీకరించారు. 1980 దశకంలో ఏఐఎస్‌ఎఫ్‌లో చేరి వామపక్ష విద్యార్థి నాయకుడిగా ప్రభుత్వ వ్యతిరేఖ విధానాలపై పోరాడారు. ఆ తర్వాత బీజేపీలో చేరి వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన తాజాగా నరసాపురం నుంచి 2,76,802 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే.

Similar News

News November 8, 2025

భీమవరం: బ్యాంకుల అధికారులపై కలెక్టర్ అసహనం

image

పీఎం స్వనిధి, వీవర్స్ ముద్ర, ఎస్‌హెచ్‌సి గ్రూపులకు బ్యాంకర్లు వెంటనే రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. శుక్రవారం భీమవరం క్యాంపు కార్యాలయం నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా బ్యాంకర్లు, అధికారులతో ఆమె సమీక్షించారు. పీఎం స్వనిధి కింద నిధులు విడుదలలో కొన్ని బ్యాంకులు తాత్సారం చేయడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ, వేగవంతంగా రుణాలు అందించాలని సూచించారు.

News November 7, 2025

ఆక్వా రైతుల అభివృద్ధికి సహకారం అందించాలి: కలెక్టర్

image

జిల్లాలోని ఆక్వా రైతుల అభివృద్ధికి సహకారం అందించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ జాయింట్ సెక్రటరీ నీతు కుమారి మత్స్య శాఖపై జిల్లా కలెక్టర్లు, మత్స్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భీమవరం కలెక్టరేట్ నుంచి హాజరైన కలెక్టర్ నాగరాణి, జాయింట్ సెక్రటరీ నీతు కుమారితో పలు కీలక అంశాలను తెలియజేశారు.

News November 7, 2025

భీమవరం: క్యాన్సర్ అవగాహన దినోత్సవ ర్యాలీ

image

ముందస్తు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల ద్వారా వ్యాధిని నూరు శాతం నిరోధించవచ్చని కలెక్టర్ నాగరాణి అన్నారు. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం భీమవరం ప్రకాశం చౌక్‌లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించినట్లయితే, వ్యాధి నుంచి కోలుకునే అవకాశం గణనీయంగా పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే రామాంజనేయులు, ఎస్పీ నయీం అస్మీ పాల్గొన్నారు.