News February 7, 2025
కేంద్రమంత్రితో మంత్రి స్వామి భేటీ

ఢిల్లీలోని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్‌తో శుక్రవారం మంత్రి స్వామి భేటి అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రమంత్రితో చర్చించారు. PM AJAY ఆదర్శ గ్రామ్ స్కీం కింద, రాష్ట్రంలో ఎంపిక చేసిన 526 గ్రామాల్లో అభివృద్ధి పనులకు రూ.110 కోట్లు విడుదల చేయాలన్నారు. 75 సాంఘిక సంక్షేమ నూతన వసతి గృహాల నిర్మాణానికి రూ.245 కోట్లు విడుదల చేయాలని కోరారు.
Similar News
News April 24, 2025
అర్థవీడులో పులి సంచారం

అర్ధవీడు మండల పరిసర ప్రాంతాల్లో పెద్ద పులుల సంచారం నిజమేనని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. రెండు రోజుల క్రితం మొహిద్దిన్ పురం సమీపంలో రోడ్డుపై పెద్దపులి కనిపించగా స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్పటి నుంచి అధికారులు తనిఖీలు చేశారు. స్థానికంగా కనిపించిన గుర్తుల ఆధారంగా ఈ ప్రాంతంలో పులి తిరుగుతున్నట్లుగా డీఆర్వో ప్రసాద్ రెడ్డి బుధవారం నిర్ధారించారు.
News April 23, 2025
ఒంగోలులో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ

ఉగ్ర దాడిని నిరసిస్తూ ఒంగోలులో వైసీపీ క్యాండిల్ ర్యాలీ చేపట్టింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అధ్యక్షతన మార్కెట్ కాంప్లెక్స్ నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి మృతులకు సంతాపం తెలిపారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.
News April 23, 2025
వీరయ్య చౌదరి ఒంటిపై 53 కత్తిపోట్లు: CM

వీరయ్య చౌదరి లాంటి నేతను కోల్పోవడం చాలా బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. అమ్మనబ్రోలులో ఆయన మాట్లాడుతూ.. ‘నారా లోకేశ్, అమరావతి రైతుల పాదయాత్రలో వీరయ్య కీలకంగా ఉన్నారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నా. వీరయ్య ఒంటిపై 53 కత్తిపోట్లు ఉన్నాయి. ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టను. ఎక్కడ దాక్కున్నా లాక్కొని వస్తా’ అని సీఎం హెచ్చరించారు.