News November 13, 2025

కేంద్రీయ విద్యాలయం, నవోదయలో 12,799 పోస్టులు

image

కేంద్రీయ విద్యాలయం, నవోదయలో 12,799 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో కేంద్రీయ విద్యాలయంలో 9,156( 7,444 టీచింగ్, 1,712 నాన్ టీచింగ్ పోస్టులు), నవోదయలో 3,643 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ, B.Ed, D.Ed, పీజీ, సీటెట్, ఇంటర్, డిప్లొమా, B.LSc అర్హతగల అభ్యర్థులు రేపటి నుంచి డిసెంబర్ 4వరకు అప్లై చేసుకోవచ్చు.

Similar News

News November 13, 2025

సింగరేణిలో 82 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

సింగరేణిలో 82 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్నల్ అభ్యర్థులతో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 24లోగా అప్లై చేసుకోవాలి. దరఖాస్తు హార్డ్ కాపీని ఈనెల 26లోగా పంపాలి. బేసిక్ శాలరీ నెలకు రూ.50,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: scclmines.com

News November 13, 2025

ప్రతి కశ్మీరీ ముస్లిం టెర్రరిస్టు కాదు: J&K సీఎం

image

ప్రతి కశ్మీరీ ముస్లిం టెర్రరిస్టు కాదని జమ్మూకశ్మీర్ CM ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఢిల్లీ పేలుడు ఘటనను ఆయన ఖండించారు. అమాయకులను క్రూరంగా చంపడాన్ని ఏ మతమూ సమర్థించదని తెలిపారు. కశ్మీర్‌లో శాంతి, సోదరభావాన్ని నాశనం చేసేవారు కొందరు ఉంటారని విమర్శించారు. బ్లాస్ట్‌ కారకులను కఠినంగా శిక్షించాలని, అమాయకులను వదిలేయాలని కోరారు. ఓ డాక్టర్‌ను <<18268521>>ఉద్యోగం నుంచి తొలగించాక<<>> దర్యాప్తు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

News November 13, 2025

ప్రపంచ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌‌లో రష్మి అయ్యర్‌కు గోల్డ్ మెడల్

image

దక్షిణాఫ్రికాలోజరిగిన ప్రపంచ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ 2025లో నాగ్‌పూర్‌కు చెందిన రష్మీఅయ్యర్ గోల్డ్ మెడల్ గెలిచి రికార్డు సృష్టించారు. ఇందులో 22 దేశాల నుండి 390 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. గతేడాది కజకిస్తాన్‌లో జరిగిన ఛాంపియన్‌షిప్‌లో కూడా గోల్డ్ మెడల్ సాధించిన ఆమె వరుసగా రెండుసార్లు ఈ ఘనత సాధించి రికార్డు సృష్టించారు. గతేడాది స్పాన్సర్లు లేకపోవడంతో ఆమె తన బంగారం అమ్మి పోటీల్లో పాల్గొన్నారు.