News April 12, 2025

కేంద్ర నిధులు సమర్థవంతంగా వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే కడియం 

image

జనగామ కలెక్టరేట్‌లో ‘దిశ’ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర గృహ నిర్మాణ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు వెంటనే ఇందిరమ్మ ఇళ్లను అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నీటి పారుదల శాఖ అధికారులు నాలాల మరమ్మతులపై చర్యలు చేపట్టాలని సూచించారు.

Similar News

News November 6, 2025

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తాడిపత్రి అమ్మాయిలు

image

అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీలలో తాడిపత్రి అమ్మాయిలు సత్తా చాటారు. SGFI ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో అండర్-17 విభాగంలో అర్షియ, అవనిక, చాందిని.. అండర్-14 విభాగంలో ఆయేషా జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు కబడ్డీ కోచ్ లక్ష్మీ నరసింహ తెలిపారు.

News November 6, 2025

ఇవాళ అమరావతికి సీఎం చంద్రబాబు

image

సీఎం చంద్రబాబు లండన్ పర్యటన ముగిసింది. నిన్న రాత్రి 7.30 గంటలకు లండన్ నుంచి స్వదేశానికి తిరిగి పయనమయ్యారు. ఉదయం హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో అమరావతికి బయల్దేరనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో భేటీ కానున్నారు. డేటా డ్రివెన్ గవర్నెన్స్‌పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

News November 6, 2025

సిద్దిపేటలో ఈనెల 7న మినీ జాబ్ మేళా

image

సిద్దిపేటలోని సెట్విన్ కేంద్రంలో ఈ నెల 7న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రాఘవేందర్ తెలిపారు. ఈ మేళాలో హైదరాబాద్‌లోని అపోలో ఫార్మసీలో పలు ఖాళీ పోస్టుల కోసం ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. SSC, ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్న విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.