News February 2, 2025

కేంద్ర బడ్జెట్‌పై కరీంనగర్ MP ప్రశంసలు

image

కేంద్ర బడ్జెట్ 2025-26 కేవలం లెక్కల పద్దు మాత్రమే అని, ఇది ప్రధాని మోదీ దార్శనికత, స్వావలంబన, వృద్ధి, శ్రేయస్సుతో కూడిన వికసిత భారత్‌కు ఒక రోడ్ మ్యాప్ అని కరీంనగర్ MP, కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. రైతు సంక్షేమం, మధ్యతరగతికి ఉపశమనం, మహిళలు, యువతకు సాధికారత కల్పించడం, స్టార్టప్‌లకు ప్రోత్సాహం వంటివి ఈ బడ్జెట్‌లో చూడవచ్చన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులను ప్రోత్సహించారని వివరించారు.

Similar News

News February 2, 2025

శావల్యాపురం: కాలువలో యువకుడి మృతదేహం లభ్యం

image

శావల్యాపురం మండలం ఘంటేవారిపాలెం కాలువలో ఆదివారం ఓ యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.  

News February 2, 2025

HYD: సీఎం సంకుచిత మనస్తత్వాన్ని నిరసించాల్సిందే: BRS

image

14 ఏళ్లు పోరాడి తెలంగాణ తెచ్చిన కేసీఆర్, పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా చేసిన సేవలు, ఆయన వయస్సు, శారీరక స్థితిపై సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం తెలంగాణ సమాజాన్ని నివ్వెర పరిచాయని బీఆర్ఎస్ Xలో ట్వీట్ చేసింది. కేసీఆర్ ప్రమాదంలో గాయపడితే దాన్ని కూడా రాజకీయ విమర్శలకు ఉపయోగించుకోవాలన్న రేవంత్ రెడ్డి సంకుచిత మనస్తత్వాన్ని కచ్చితంగా నిరసించాల్సిందేనని మండిపడింది.

News February 2, 2025

MBNR: పరీక్షల షెడ్యూల్ విడుదల

image

మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌ (B.PEd) మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షలు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్ష హాలులోకి తప్పనిసరిగా హాల్ టికెట్, ఆధార్ కార్డు తీసుకొని రావాలని తెలిపారు.