News February 2, 2025
కేంద్ర బడ్జెట్‌పై కరీంనగర్ MP ప్రశంసలు

కేంద్ర బడ్జెట్ 2025-26 కేవలం లెక్కల పద్దు మాత్రమే అని, ఇది ప్రధాని మోదీ దార్శనికత, స్వావలంబన, వృద్ధి, శ్రేయస్సుతో కూడిన వికసిత భారత్‌కు ఒక రోడ్ మ్యాప్ అని కరీంనగర్ MP, కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. రైతు సంక్షేమం, మధ్యతరగతికి ఉపశమనం, మహిళలు, యువతకు సాధికారత కల్పించడం, స్టార్టప్‌లకు ప్రోత్సాహం వంటివి ఈ బడ్జెట్‌లో చూడవచ్చన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులను ప్రోత్సహించారని వివరించారు.
Similar News
News February 28, 2026
జగిత్యాల: మహిళకు పూర్తి రక్షణ కల్పించాం: డీడబ్ల్యూఓ

జగిత్యాల సఖి వన్ స్టాప్ సెంటర్ లో చోటుచేసుకున్న ఘటనపై జిల్లా సంక్షేమ అధికారి (DWO) కె. రాజ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. సెంటర్‌లో ఆశ్రయం పొందుతున్న మహిళకు పూర్తి రక్షణ కల్పించామని తెలిపారు. కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన వ్యక్తి ప్రమాదం నుంచి బయటపడ్డాడని చెప్పారు. ఘటనపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
News February 28, 2026
పాక్‌తో మేము చర్చలకు సిద్ధం: అఫ్గానిస్థాన్

పాక్‌తో యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని అనుకుంటున్నట్లు అఫ్గానిస్థాన్ ప్రకటించింది. కాగా ఇప్పటికే ఈ ఉద్రిక్తతలపై వెనక్కి తగ్గాలని చైనా, బ్రిటన్ సహా పలు దేశాలు సూచించాయి. అఫ్గాన్‌తో పోరులో 274 మంది తాలిబన్లను అంతం చేశామని మరో 400 మంది గాయపడినట్లు పాకిస్థాన్ ప్రకటించింది. అంతకుముందు తమ దాడుల్లో 50 మంది పాకిస్థాన్ జవాన్లు చనిపోయినట్లు తాలిబన్ సర్కార్ చెప్పుకొచ్చింది.
News February 28, 2026
అన్నదాతకు రూ.25 వేల మద్దతు ధర వచ్చేనా.?

వరికి ఒక క్వింటా ₹2389 లెక్కన పుట్టి ధర ₹21330 వరకు A- గ్రేడ్ రకానికి ఇస్తుండగా సాధారణ రకానికి పుట్టి ధర ₹20,136 చొప్పున నిర్ణయించారు. అయితే కేంద్రాల్లో ధాన్యం విక్రాయించాలంటే తరుగులతో కొంత తీసేస్తుండగా గొనె సంచులు, రవాణా ఖర్చులు రైతులే భరించాల్సి ఉంది. దీంతో ఎకరాకు రూ.35-40 వేల వరకు ఖర్చు అవుతుండగా రైతుకు రూ.20 వేలు కూడా మిగలడం లేదు. ప్రభుత్వం పుట్టికి రూ.25 వేల మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరారు.


