News February 1, 2025

కేంద్ర బడ్జెట్‌‌లో కొత్తగూడెం ప్రజలకు నిరాశే: సీపీఐ

image

కొత్తగూడెంలో విమానాశ్రయ నిర్మాణం, మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు జరగకపోవడం జిల్లా ప్రజలను నిరాశకు గురిచేసిందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే.షాబీర్ పాషా అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ వ్యవసాయ, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి రంగాలను పూర్తిగా విస్మరించారని దుయ్యబట్టారు. రైతులను, నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని ధ్వజమెత్తారు.

Similar News

News February 25, 2026

విశాఖలో దారుణం.. భార్యను చంపేసిన భర్త

image

విశాఖ(D) ఆరిలోవ బాలాజీ నగర్‌లో భార్యను, భర్త చంపేసిన ఘటన చోటుచేసుకుంది. ఇక్కడే ఉంటున్న బురదపాటి దేముడు, దుర్గ(33)కు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రం ఇదే తరహాలో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకోగా చున్నీని ఆమె మెడకు చుట్టి చంపేసి ఇంట్లో దాక్కున్నాడు. దుర్గ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని సీఐ మల్లేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News February 25, 2026

పాలకొల్లు: మేకా శేషుబాబుపై సస్పెన్షన్ ఎత్తివేత

image

మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబుపై విధించిన సస్పెన్షన్‌ను వైసీపీ అధిష్ఠానం ఎత్తివేసింది. పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు మంగళవారం రాత్రి ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. ఇటీవల వైఎస్ జగన్‌ను కలిసి తన కుమారుడి వివాహానికి ఆహ్వానించిన శేషుబాబు, త్వరలోనే రీఎంట్రీ ఇస్తారనే ప్రచారానికి ఈ నిర్ణయంతో బలం చేకూరింది. పార్టీ ప్రకటనతో ఆయన అనుచరులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News February 25, 2026

యాదగిరిగుట్టలో ఎదురుకోలు ఉత్సవం

image

యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి అశ్వ వాహన సేవను ఘనంగా నిర్వహించారు. స్వామివారు అశ్వ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చి ఆశీర్వదించారు. అనంతరం రాత్రి 8:45 గంటలకు ఎదురుకోలు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలను కనులార తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ అధికారులు, అర్చకులు ఈ పవిత్ర కార్యక్రమాల్లో పాల్గొన్నారు.